సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రవితేజ కూతురిని చూశారా.. హీరోయిన్లను మించి ఉందిగా

ABN, Publish Date - May 03 , 2026 | 06:26 PM

స్టార్ హీరోల వారసులు ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటారు. నిత్యం వారి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటాయి.

Raviteja

స్టార్ హీరోల వారసులు ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటారు. నిత్యం వారి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటాయి. కానీ, మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఫ్యామిలీ ఫొటోస్ మాత్రం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొన్నేళ్ల క్రితం వరకు రవితేజ పిల్లల ఫోటోలు ఎవరూ చూసింది కూడా లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ మధ్యనే రవితేజ కొడుకు, కూతురు సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. రవితేజకు ఇద్దరు పిల్లలు.. పెద్ద కూతురు మోక్షద భూపతిరాజు, కొడుకు మహాధన్ భూపతిరాజు.


మహాధన్ .. రాజా ది గ్రేట్ లో చిన్నప్పటి రవితేజగా నటించి మెప్పించాడు. త్వరలోనే ఈ కుర్రాడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు అనుకుంటే.. సందీప్ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూ దర్శకత్వంలో మెళుకువలు నేర్చుకుంటున్నాడు. ఇక కూతురు మోక్షద సైతం ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తోంది. అందంలో మోక్షద హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోదు. తాజాగా రవితేజ, కూతురు మోక్షద.. నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె రిసెప్షన్ లో కనిపించారు.


బ్లాక్ అండ్ బ్లాక్ లో రవితేజ సింపుల్ గా కనిపించగా.. మోక్షద సైతం డిజైనర్ డ్రెస్ లో అందంగా కనిపించింది. కుర్ర హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని అందంతో మోక్షద అదరగొట్టేసింది. ఇక వీరిద్దరిని చూసి నెటిజన్స్ తండ్రీకూతరిలా లేరు.. ఫ్రెండ్స్ లా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రవితేజ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఇరుముడి సినిమాతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - May 03 , 2026 | 07:35 PM