తండ్రి జయంతి సందర్భంగా రవి బాబు'రేజర్'
ABN, Publish Date - Apr 10 , 2026 | 07:18 PM
నటుడు, దర్శకుడు రవి బాబు (Ravibabu) చేసే ఏ సినిమా అయినా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ప్రస్తుతం అయన కీలక పాత్ర పోషిస్తూ డైరెక్ట్ చేస్తున్న సినిమా 'రేజర్'(Razor).
నటుడు, దర్శకుడు రవి బాబు (Ravibabu) చేసే ఏ సినిమా అయినా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ప్రస్తుతం అయన కీలక పాత్ర పోషిస్తూ డైరెక్ట్ చేస్తున్న సినిమా 'రేజర్'(Razor). టైటిల్ ప్రకటించినప్పటి నుంచే సోషల్ మీడియాలో మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేసింది . మేకర్స్ ఈ సినిమా అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరిలో జరిగిన కీలక షెడ్యూల్ తో షూటింగ్ పూర్తయింది. పోస్ట్-ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం విడుదలకు ఈ సినిమా సిద్ధంగా ఉంది. 'రేజర్' వరల్డ్ ని పరిచయం చేసేలా ఆకట్టుకునే కొత్త పోస్టర్లను విడుదల చేశారు మేకర్స్.
అర్బన్, ఇండస్ట్రియల్ షాడోస్ మధ్య ఇంటెన్స్ పవర్ ఫుల్ గా కనిపించిన రవిబాబు లుక్ ఆకట్టుకుంది. ఒక పోస్టర్‌లో చిన్నారి చేతిని పట్టుకుని వీధిలో నడుస్తూ కనిపించడం సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే ఈ సినిమా విడుదలపై రవి బాబు క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి చలపతి రావు జయంతిని పురస్కరించుకుని మే 8న సినిమాను ప్రపంచం వ్యాప్తంగా రేజర్' విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది.