మల్లెపూల పల్లకి.. అనుకున్నట్లే జరిగింది
ABN , Publish Date - Aug 21 , 2026 | 08:45 PM
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అంటూ మాస్ మాహారాజా ఫ్యాన్స్ పాటలు పాడేసుకుంటున్నారు. దాదాపు నాలుగేళ్లుగా రవితేజకు సరైన హిట్ లేదు.
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అంటూ మాస్ మాహారాజా ఫ్యాన్స్ పాటలు పాడేసుకుంటున్నారు. దాదాపు నాలుగేళ్లుగా రవితేజ (Raviteja)కు సరైన హిట్ లేదు. ఎట్టకేలకు నేడు రిలీజైన ఇరుముడి( Irumudi)థియేటర్లలో విడుదలై సర్వత్రా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటుంది.శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించగా.. బేబీ నక్షత్ర కీలక పాత్రలో నటించింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా చాలా కాలం తర్వాత రవితేజ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఘనస్వాగతం అందేలా చేసింది.
ఇక ఈ సినిమాలో ప్రధానంగా మల్లెపూల పల్లకి పాట వినిపిస్తున్నప్పుడు థియేటర్లలో ప్రేక్షకుల స్పందన మైండ్ బ్లాకింగ్ అని చెప్పాలి. ఇంకా అయ్యప్ప మాల సీజన్ ప్రారంభం కానప్పటికీ, ఏళ్ల తరబడి దీక్ష తీసుకుంటున్న భక్తులు, యూత్ ఈ పాటకు తీవ్రంగా కనెక్ట్ అయ్యారు. హైదరాబాద్‌లోని విమల్, సంధ్య థియేటర్ల నుంచి కరీంనగర్, కర్నూలు వరకు అన్ని ప్రాంతాల్లోనూ ప్రేక్షకులు సీట్లలో నుంచి లేచి పూలు చల్లుతూ డ్యాన్సులు చేస్తున్నారు. అంతేకాకుండా, కొందరు అయితే ఆ సాంగ్ వచ్చినప్పుడు హారతులు ఇస్తున్నారు. ఈ పాట తర్వాత వచ్చే ఛేజింగ్ సీన్‌లో కూడా ఇదే సాంగ్ బిట్‌ను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా వాడటం క్యారెక్టర్ ఎలివేషన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.
మల్లెపూల పల్లకి సాంగ్ ఈ చిత్రంలో ఉంది అన్నప్పటి నుంచి ప్రేక్షకులు థియేటర్లను గుడులుగా మారుస్తారు అని చెప్పుకోస్తూనే ఉన్నారు. ఆ తరువాత మల్లెపూల పల్లకి సాంగ్ రిలీజ్ అయ్యినప్పుడు రీమిక్స్ లేదు.. కొత్తగా ఉంది.. ఊపు లేదు అంటూ పెదవి విరిచారు. కానీ, థియేటర్ లో మాత్రం ఆ సాంగ్ ని ఫ్యాన్స్ ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తున్నారు అంటే ఒక్కో ప్రేక్షకుడు ఒక్కో అయ్యప్ప భక్తుడుగా మారిపోతున్నాడంటే అతిశయోక్తి లేదు. ఈ సాంగ్ కే కాకుండా ఇరుముడి కట్టు సాంగ్ కి కూడా ఫ్యాన్స్ డ్యాన్స్ చేస్తున్నారు. ఈ సాంగ్స్ వలన సినిమాకు వేరే లెవెల్ హైప్ వచ్చిందని చెప్పొచ్చు.
దర్శకుడు శివ నిర్వాణ ఒక పక్కా క్రైమ్ రివెంజ్ థ్రిల్లర్ కథలో అయ్యప్ప మాల అంశాన్ని జోడించడమే కాకుండా ట్విస్టులను చాలా సమర్థవంతంగా డిజైన్ చేసి ప్రేక్షకులను మెప్పించాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా, థియేటర్లలో వస్తున్న ఈ డివైన్ అండ్ మాస్ వైబ్ కోసమే ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్లకు తరలివస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ పాటల రీల్స్ భారీగా వైరల్ అవుతుండటంతో, రవితేజ అభిమానులు ఈ బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ చూసి యమా ఆనందంలో ఉన్నారు. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ సినిమాతో రవితేజ వందకోట్ల క్లబ్ లో చేరతాడో లేదో చూడాలి.