Raviteja: ‘ఇరుముడి’ ఒక ఎమోషనల్ రైడ్.. డిఫరెంట్ రవితేజను చూస్తారు

ABN , Publish Date - Aug 17 , 2026 | 07:08 AM

‘ఇరుముడి’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఇది ఒక మంచి ఎమోషనల్ రైడ్. ఒక విషయం మాత్రం బల్లగుద్ది చెబుతున్నాను.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది.  ప్రేక్షకులందరూ థియేటర్లలో ఒక మంచి సినిమాను ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు.

‘ఇరుముడి’ (Irumudi) నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఇది ఒక మంచి ఎమోషనల్ రైడ్. ఒక విషయం మాత్రం బల్లగుద్ది చెబుతున్నాను.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది.  ప్రేక్షకులందరూ థియేటర్లలో ఒక మంచి సినిమాను ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఇందులో మీరు ఇప్పటివరకు చూడని ఒక డిఫరెంట్ రవితేజను చూస్తారు. నా పాత్ర, కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కచ్చితంగా కనెక్ట్ చేస్తాయని నమ్ముతున్నాను'  అని రవితేజ (Ravi Teja) అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం  ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో  మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. ఆగస్టు 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో హుషారుగా సాగే ' మల్లెపూల పల్లకి' సాంగ్ ను విడుదల చేశారు. 


రవితేజ మాట్లాడుతూ
'ఈ సినిమా ఒక మంచి ఎమోషనల్ రైడ్. నేను చెప్పడం కంటే సినిమా చూసిన తర్వాత మీరే చెబుతారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు. ప్రతి క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది. స్వాసిక నటన చూస్తే మీకు భయమేస్తుంది. అంత అద్భుతంగా చేసింది. కొన్ని క్యారెక్టర్స్ మీ మైండ్‌లో ఉండిపోతాయి. సినిమా చూసాక మీకే అర్థమవుతుంది. ఇందులో ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సాయికుమార్గాను కొత్తగా చూస్తారు. సినిమా గురించి చాలా మాట్లాడుకుంటారు. జీవీ ప్రకాష్ బ్రహ్మాండమైన పాటలు ఇచ్చారు. నక్షత్ర ఫ్యూచర్‌లో చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ మిమ్మల్ని టచ్ చేస్తాయి. సినిమాలో మీకు ప్రియా భవానీ శంకర్ కనిపించదు.. కేవలం కావేరి పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఒకటి రెండు మూడు సీన్లు ఉంటాయి.. వాటిలో ఎక్స్‌లెంట్‌గా  పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మా నిర్మాతలు రవి, నవీన్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మా కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా. భవిష్యత్‌లో ఇంకా సినిమాలు చేస్తాం' అని అన్నారు. 

శివ నిర్వాణ మాట్లాడుతూ 'మల్లెపూల పల్లకి’ పాట కోసం చాలా కష్టపడ్డాం. ఒరిజినల్ కంపోజర్స్, సింగర్స్‌తోనే ఈ పాటను చేయించాం. థియేటర్‌లో ఈ పాట చాలా గ్రాండ్‌గా ఉంటుంది. ‘ఇరుముడి’ నా గత సినిమాల్లా లైట్‌హార్టెడ్‌గా ఉండదు. ఇది చాలా సీరియస్, ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామా. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు చాలా ఆసక్తికరంగా, టెన్షన్‌తో సాగుతాయి. తెలుగు సినిమాల్లో వచ్చిన మోస్ట్ ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని నమ్ముతున్నాను. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు మంచి ఎమోషన్‌తో పాటు మంచి మెసేజ్ కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. రవితేజ గారితో సినిమా చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. ఆయన అద్భుతమైన పెర్ఫార్మర్. ఆయనతో షూటింగ్ కూడా చాలా వేగంగా పూర్తవుతుంది. సీలేరు రియల్ లొకేషన్స్‌లో సినిమాను తెరకెక్కించాం. రవితేజ గారి పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ప్రియా, సాయికుమార్, నక్షత్ర కూడా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా రవితేజ, నక్షత్ర మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కదిలిస్తాయి. ‘ఇరుముడి’ ఒక మంచి ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని నేను నమ్ముతున్నాను' అన్నారు.

Updated Date - Aug 17 , 2026 | 07:56 AM