Raviteja: రవితేజ మల్టీస్టారర్ మొదలయ్యేది అప్పుడే..
ABN , Publish Date - Aug 23 , 2026 | 01:00 PM
రవితేజ వరుస చిత్రాలు చేస్తున్న.. సరైన విజయం అందుకొని చాలా కాలమైంది. తాజాగా విడుదలైన 'ఇరుముడి' ఆయనకు చక్కని విజయాన్ని అందించింది.
రవితేజ (Raviteja) వరుస చిత్రాలు చేస్తున్న.. సరైన విజయం అందుకొని చాలా కాలమైంది. తాజాగా విడుదలైన 'ఇరుముడి' ఆయనకు చక్కని విజయాన్ని అందించింది. దీనితో ఆయన మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశారు. ఈ సక్సెస్ తదుపరి సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. ప్రస్తుతం 'ఇరుముడి' సినిమా సక్సెస్ ను ఆస్వాదిస్తున్న ఆయన త్వరలో తదుపరి చిత్రంతో బిజీ కానున్నారు. శ్రీ విష్ణుతో కలిసి రవి తేజ ఓ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారు. హసిత్ గోలి (Hasith Goli) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాను ఆగస్టు 28న లాంఛనంగా ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రవితేజ, శ్రీ విష్ణు వంటి ఇద్దరు విభిన్నమైన నటులు ఒకే సినిమాలో కనిపించనుండటంతో కథ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇద్దరి పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుందని, మల్టీస్టారర్ అనే ట్యాగ్‌కు తగ్గట్టుగా సినిమా ఉండేలా దర్శకుడు కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 2027 సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. త్వరలో ఇతర వివరాలను మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది.