గేర్ మార్చిన రవిబాబు.. యాక్షన్ హీరోగా ‘రేజర్’
ABN, Publish Date - Feb 11 , 2026 | 10:07 AM
నటుడు, దర్శకుడు రవిబాబు హీరోగా నటిస్తూ రూపొందించిన కొత్త చిత్రం ‘రేజర్’ షూటింగ్ పూర్తి చేసుకుంది.
గత నెలలో ‘ఏనుగు తొండం ఘటికాచలం’ (Yenugu Thondam Ghatikachalam) వంటి వినోదభరిత చిత్రంతో ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన నటుడు, దర్శకుడు రవిబాబు (Ravi Babu) మరో కొత్త చిత్రంతో వస్తున్నారు. ఆ చిత్రం తర్వాత ఆయన రూపొందించిన ‘రేజర్’ (RAZOR) చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. సీనియర్ నిర్మాత సురేశ్‌బాబు సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్ (Suresh Productions), ఫ్లయింగ్ ఫ్రాగ్స్ (Flying Frogs Production) సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రవిబాబు హీరోగా నటిస్తుండడం విశేషం.
టెన్షన్, వైలెన్స్ అంశాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా పోస్టర్‌ను, గ్లింప్స్‌ను మంగళవారం విడుదల చేశారు. తెలుగు సినిమాల్లో ఇంతవరకూ చూడని కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ‘రేజర్’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. వేసవిలో విడుదల చేస్తామని రవిబాబు చెప్పారు. అయితే.. ఇన్నాళ్లు యూత్, హర్రర్, కామెడీ చిత్రాలతో అలరించిన రవిబాబు సడన్‌గా తన స్టైల్ పూర్తిగా మార్చి బ్రూతల్ యాక్షన్ మోడ్‌లోకి రావడంపై ఫ్యాన్స్ ఆశ్చర్య పోతున్నారు.