రణబాలి: పుట్టినరోజు స్పెషల్.. రష్మిక లుక్ అదిరింది
ABN , Publish Date - Apr 05 , 2026 | 05:05 PM
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రణబాలి'. రష్మిక పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ వీడియో వదిలారు మేకర్స్
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రణబాలి'. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా రూపొందుతోంది. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది.ఏప్రిల్ 5న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో రష్మిక జయమ్మగా ఎంతో సహజంగా కనిపించారు. 'రణబాలి బలం జయమ్మ, అతని సంతోషాలకు కారణం జయమ్మ అంటూ ఈ వీడియోలో పేర్కొన్నారు. ఇటీవల అనంతపూర్ షెడ్యూల్ పూర్తయింది. ఇందులో రణబాలి అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ, జయమ్మగా రశ్మిక మందన్న ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నారు.