బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన రష్మిక.. ఇదస్సలు ఊహించలేదే

ABN , Publish Date - Sep 13 , 2026 | 05:51 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి.

Rashmika Mandanna

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి (Ranabaali). రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ భారీ ప్రాజెక్టుపై టాలీవుడ్‌లోనే కాకుండా పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి హిట్ చిత్రాల తర్వాత విజయ్-రష్మిక హిట్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో పాటు.. వీరిద్దరి పెళ్లి తరువాత వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.


తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తన షూటింగ్ పార్ట్‌ను రష్మిక మందన్న విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రణబాలి చిత్రబృందం సెట్స్‌లోని ప్రత్యేక వాతావరణాన్ని, రష్మిక షూటింగ్ పూర్తి చేసుకున్న క్షణాలను తెలియజేస్తూ ఒక ప్రత్యేక వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ సినిమాలో రష్మిక జయమ్మ అనే ఎంతో ప్రాధాన్యత కలిగిన గ్రామీణ యువతి పాత్రలో నటిస్తుండగా, ఆమె నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


అయితే చిత్రబృందం విడుదల చేసిన ఈ వీడియోలో రష్మిక మందన్న గర్భవతిగా కనిపించడం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. జయమ్మ పాత్రకు సంబంధించిన ఈ సర్ప్రైజ్ లుక్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 1876-78 మద్రాస్ ప్రెసిడెన్సీ కరువు, బ్రిటీష్ పరిపాలన నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ కథలో రష్మిక పాత్ర ఎంతటి భావోద్వేగభరితంగా, పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో ఈ లుక్ స్పష్టం చేస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


విజయ్ దేవరకొండ బొబ్బిలి రణబాలిగా పవర్‌ఫుల్ తిరుగుబాటుదారుడి పాత్రలో నటిస్తుండగా, జయమ్మగా రష్మిక మేకోవర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. షూటింగ్ వేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. విజయ్-రష్మిక కెమిస్ట్రీతో పాటు దశాబ్దాల క్రితం నాటి డ్రామాను తెరపై ఎలా ఆవిష్కరించారనే విషయం తెలుసుకోవడానికి సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వీడియోలో రష్మిక బేబీ బంప్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇలాంటి రోల్ అస్సలు ఊహించలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 16 న రిలీజ్ కానుంది. మరి రణబాలితో విజయ్ - రష్మిక ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Updated Date - Sep 13 , 2026 | 05:51 PM