రణబాలి.. వంద రోజుల షూటింగ్ పూర్తి
ABN , Publish Date - Jun 07 , 2026 | 08:21 AM
స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న రణబాలి చిత్రం వంద రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది.
స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటిస్తున్న 'రణబాలిస (Ranabali) చిత్రం వంద రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవల గండికోటలో వారం రోజుల పాటు జరిగిన షూటింగ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ చిత్రీకరించారు. ఇప్పటిదాకా 90 శాతం వర్క్ పూర్తయిం దనీ, ఔటోడోర్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు సంతృప్తికరంగా వచ్చాయని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
19వ శతాబ్దాం నేపథ్యంలో 1854-1878 మధ్య బ్రిటీష్ పాలన కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా 'రణబాలి' చిత్రం రూపుదిద్దుకుంటోంది. మిగిలిన వర్క్ పూర్తి చేసి సెప్టెంబర్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాహుల్ సాంకృ త్యన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.