‘రాకా’లో రక్తపిశాచిగా.. రష్మిక ఇమేజ్‌ని ఛేంజ్ చేసే ఛాలెంజింగ్ రోల్!

ABN , Publish Date - Jun 29 , 2026 | 10:29 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘రాకా’. రీసెంట్‌గానే ఈ మూవీ టైటిల్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రష్మిక ఓ కీలక పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే.

Rashmika Role in Raaka

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘రాకా’ (Raaka). రీసెంట్‌గానే ఈ మూవీ టైటిల్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి, ఎటువంటి అంచనాలు నెలకొన్నాయో తెలియంది కాదు. తాజాగా ఈ మూవీలో నటిస్తోన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) పాత్రకు సంబంధించి నిర్మాత లగడపాటి శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు, చెప్పిన మాటలు.. మరోసారి ‘రాకా’ గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి. పాన్-ఇండియా సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రమైన ఇందులో రష్మిక నెగిటివ్ రోల్.. అందులోనూ క్రూరమైన రక్తపిశాచి పాత్ర చేస్తున్నట్లుగా మొదటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు లగడపాటి శ్రీధర్ (Lagadapati Sridhar) ఏం చెప్పారంటే..


‘‘అల్లు అర్జున్ ‘రాకా’ సినిమాలో రష్మిక రోల్ గురించి నాకు పూర్తి అవగాహన లేదు కానీ, ఒకవేళ ఆమె ఇలాంటి డార్క్ షేడ్ ఉన్న విలన్ పాత్రలో నటిస్తుంటే మాత్రం.. అది ఆమె కెరీర్‌కే ఒక సరికొత్త ఛాలెంజ్ అవుతుంది. ప్రేక్షకులు రష్మికను ఎప్పుడూ గ్లామరస్, ఎమోషనల్ పాత్రల్లోనే ఎక్కువగా ఇష్టపడ్డారు. ఒకవేళ ఇప్పుడు వినిపిస్తోన్న వార్తలు నిజమైతే, నటిగా ఆమె ఇమేజ్‌ను ఈ రోల్ పూర్తిగా మార్చేస్తుందని మాత్రం చెప్పగలను. చూడాలి ఆమె పాత్రను అట్లీ ఎలా డిజైన్ చేశారో...’’ అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.


డైరెక్టర్ అట్లీ ఈ సినిమాలో రష్మిక క్యారెక్టర్‌ను ఎవరూ ఊహించని ట్విస్టులతో, చాలా డార్క్ అండ్ లేయర్డ్‌గా డిజైన్ చేశారనేలా వినిపిస్తోన్న వార్తలపై లగడపాటి అలా చెప్పి ఉంటారు. ఆయన చెప్పినట్లుగా.. ఇప్పటి వరకు రష్మికను గ్లామర్ రోల్స్‌లోనే చూశారు. అందులోనూ అల్లు అర్జున్ సరసన శ్రీవల్లిగా రష్మిక కనిపించిన తీరుకు ప్రపంచమే ఫిదా అయ్యింది. వీరిద్దరిని రొమాంటిక్ పెయిర్‌గా ప్రపంచం పిలుచుకుంది. అలాంటి ఇద్దరి మధ్య ఇప్పుడు వార్ నడుస్తుందంటే.. వినడానికే పూనకాలు వచ్చేస్తున్నాయి. ఈ సరికొత్త స్క్రీన్ డైనమిక్స్ ప్రేక్షకులలో సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ విజువల్ వండర్‌‌కు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఓటీటీ సేఫ్‌ గేమ్‌.. ‘పెద్ది’ ప్లానింగ్ అదిరింది

డెలివరీ బాయ్‌‌‌ని కొట్టిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో.. వీడియో వైరల్

‘విశ్వంభర’ సెన్సేషనల్ అప్డేట్.. ఇక విడుదలే!

ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ అనౌన్స్‌మెంట్.. పోస్టర్ అదిరిపోయిందిగా!

Updated Date - Jun 29 , 2026 | 10:29 PM