Mysaa Teaser: ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు
ABN, Publish Date - Sep 20 , 2026 | 07:35 PM
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా మైసా (MYSAA). దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తోంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా మైసా (MYSAA). దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మైసా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకు గ్లామరస్, బబ్లీ పాత్రలతో అలరించిన రష్మిక, ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని విధంగా అత్యంత డార్క్, రా అండ్ రస్టిక్ అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
టీజర్ పరిశీలిస్తే, గ్రామీణ నేపథ్యం, అడవి వాతావరణంలో జరిగే ఒక తీవ్రమైన రివెంజ్ డ్రామాగా ఈ సినిమా రూపొందినట్లు స్పష్టమవుతోంది. తండ్రి కోసం ఒక కూతురు పడే తపనలా కనిపిస్తోంది.శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా రష్మిక చూపించిన తీవ్రమైన హావభావాలు, మాస్ యాక్షన్ సీక్వెన్సెస్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దీనికి తోడు జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌లోని ఉద్వేగాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది.
ఇక టీజర్‌లో వచ్చే పవర్‌ఫుల్ డైలాగ్స్ కూడా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 'యుద్ధానికి ఆయుధం అంటే భయం కావచ్చు.. కానీ ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు' అని రావు రమేష్ చెప్పే డైలాగ్ .. మైసా పాత్రను మరింత ఎలివేట్ చేసింది. ఇప్పటివరకు కేవలం హీరోల సినిమాల్లోనే చూసిన ఇంటెన్స్ యాక్షన్, ఎలివేషన్లను ఒక హీరోయిన్ సెంట్రిక్ సినిమాలో రష్మిక అత్యంత సహజంగా పండించడం విశేషం. ఇక చివర్లో అండర్ వాటర్ లో రష్మిక చావు నుండైనా నీకోసం వస్తాను నాన్న..అని చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇప్పటివరకు రష్మిక చేసిన సినిమాలు ఒక లెక్క.. మైసా ఒక లెక్క అని టీజర్ ని బట్టే అర్ధమవుతోంది.
రష్మిక కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోయే నవంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. మైసా టీజర్‌తో రష్మిక ఒక్కసారిగా బాక్సాఫీస్ అంచనాలను పెంచేయడమే కాకుండా, తన నటనతో మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకునేలా కనిపిస్తోంది. మరి ఈ సినిమాతో రష్మిక ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.