సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రష్మిక తల్లి కాబోతుందా..

ABN, Publish Date - Aug 24 , 2026 | 05:18 PM

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో ప్రచారమయ్యే పుకార్లకు అంతులేకుండా పోతోంది. ముఖ్యంగా సినీ తారలు వివాహం చేసుకున్న కొద్ది నెలలకే వారు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ రకరకాల వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టడం పరిపాటిగా మారింది.

Rashmika Mandanna

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో ప్రచారమయ్యే పుకార్లకు అంతులేకుండా పోతోంది. ముఖ్యంగా సినీ తారలు వివాహం చేసుకున్న కొద్ది నెలలకే వారు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ రకరకాల వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టడం పరిపాటిగా మారింది. తాజాగా నేషనల్ క్రష్, నటి రష్మిక మందన్న (Rashmika Mandanna) విషయంలోనూ సరిగ్గా ఇదే తరహా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ని ప్రేమించి వివాహం చేసుకున్న రష్మిక, ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు విస్తరిస్తున్నాయి.


ఈ రూమర్లు మొదలవ్వడానికి ప్రధాన కారణం ఇటీవల వీరిద్దరూ హాజరైన ఒక ప్రైవేట్ వివాహ వేడుక. ఇటీవల షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తూ తుంటికి తీవ్ర గాయం కావడంతో డాక్టర్ల సలహా మేరకు రష్మిక విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెల్సిందే. ఈ గ్యాప్ తర్వాత రష్మిక కెమెరా ముందకు రావడం ఇదే మొదటిసారి. ఈ వేడుకలో ఆమె నలుపు రంగు అనార్కలీ దుస్తుల్లో విజయ్‌తో కలిసి కనిపించింది. అయితే ఎప్పుడు ఫిట్ గా ఉండే అమ్మడు ఈసారి కొంచెం బొద్దుగా మారి కనిపించింది.దీంతో రష్మిక ప్రెగ్నెంట్ ఏమో అనే అనుమానాలు తలెత్తాయి. అంతేకాకుండా వేడుకలో అనార్కలీ డ్రెస్ ధరించి, దుపట్టాతో పొట్ట భాగాన్ని కవర్ చేస్తూ కనిపించడంతో, ఆమె బేబీ బంప్‌ను దాచేందుకే అలా చేసిందని కొందరు నెటిజన్లు ఊహాగానాలు మొదలుపెట్టారు.


అయితే, గాయం కారణంగా జిమ్‌కి వెళ్లకుండా బెడ్ రెస్ట్‌కే పరిమితం అవ్వడంతో ఆమె కొద్దిగా బరువు పెరిగిందని, ఈ ప్రెగ్నెన్సీ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆమె అభిమానులు చెప్పుకొస్తున్నారు. నిరంతరం కష్టపడే రష్మిక, గాయం వల్ల బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల సహజంగానే కొంత బరువు పెరిగిందని, దానిని ప్రెగ్నెన్సీగా చిత్రీకరించడం సరికాదని వారు ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో రణబాలి, మైసా వంటి పలు భారీ పాన్-ఇండియా ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నందున, రష్మిక ఇప్పుడప్పుడే అలాంటి పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం లేదని, గాయం నుంచి కోలుకున్న వెంటనే మళ్లీ షూటింగ్‌లలో పాల్గొంటుందని స్పష్టమవుతోంది. మరి రష్మిక గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తుందో అని ఇండస్ట్రీ మొత్తం ఎంతగానో ఎదురుచూస్తోంది.

Updated Date - Aug 24 , 2026 | 05:18 PM