సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మా మ్యారేజ్‌ రిసెప్షన్‌కు రండి.. సీఎం కుటుంబాన్ని ఆహ్వానించిన రష్మిక

ABN, Publish Date - Mar 01 , 2026 | 07:10 PM

సినీ నటి రష్మిక ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను కలిసి తమ వివాహ రిసెప్షన్ కు ఆహ్వానించారు.

vijay

విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda), ర‌ష్మిక (Rashmika Mandanna) వివాహం రెండు రోజుల క్రితం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. మార్చి 4న హైద‌రాబాద్‌లో సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల న‌డుమ వీరి రిసెప్ష‌న్ గ్రాండ్‌గా జ‌రుగ‌నుంది.

ఈ నేప‌థ్యంలో ఆదివారం సాయంత్రం ర‌ష్మిక... జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నివాసానికి వెళ్లి ఆమె తన వివాహ రిసెప్షన్‌ కార్డును అందించి వారి కుటుంబ స‌భ్యులను రిసెప్ష‌న్‌కు ఆహ్వానించారు.

పెళ్లైన తరువాత రష్మిక తమ ఇంటికి రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి భార్య గీత.. రష్మికకు బొట్టు పెట్టి, సారె అందించి ఆశీర్వ‌దించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - Mar 02 , 2026 | 06:33 AM