సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రష్మిక మందన్న : కూతురిలా ప్రేమించారు.. కోడలిగా కూడా ప్రేమను పంచండి

ABN, Publish Date - Mar 20 , 2026 | 12:33 PM

నటి రష్మిక గద్దర్ అవార్డు అందుకుని ప్రసంగిస్తున్న వేళ..  ఆమె అత్తయ్య, విజయ్ దేవరకొండ తల్లి భావోద్వేగానికి లోనయ్యారు. 

'ఇంతకుముందు ఒక కూతురిలా తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరించారు. మీ ప్రేమను పంచారు. ఇప్పుడు కోడలిలా మీ ముందు నిల్చున్నా. మా కుటుంబాన్ని బాగా చూసుకోండి’ అని రష్మిక మందన్న (Rashmika Mandanna)అన్నారు. 'ది గర్ల్ ఫ్రెండ్' చిత్రానికిగాను గద్దర్ ఫిలిం అవార్డ్స్ లో (Gaddar awards) ఉత్తమ నటిగా రష్మిక పురస్కారం అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ అవార్డును రష్మికకు అందజేశారు.  అనంతరం ‘మా ఊరి కోడలు...’ అంటూ యాంకర్‌ సుమకి పరిచయం చేశారు రేవంత్‌రెడ్డి. 

 

రష్మిక మాట్లాడుతూ 'ఒకప్పుడు నా నటన గురించి సోషల్ మీడియాలో  ట్రోల్స్‌ వచ్చేవి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నా నటనని మెచ్చి పురస్కారం ఇచ్చింది.  రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా అందుకున్న ఈ పురస్కారం నాకెంతో ప్రత్యేకం. ఒకప్పుడు కూతురిలా తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు కోడలిలా మీ ముందు నిల్చున్నా. గర్వంగా ఉంది. మా కుటుంబాన్ని బాగా చూసుకోండి’ అని అన్నారు. ఆమె మాటలకు రష్మిక అత్తయ్య మాధవి కన్నీళ్లు పెట్టుకున్నారు.

Updated Date - Mar 20 , 2026 | 01:20 PM