సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రష్మి తెలుసుకున్న జీవిత సత్యం.. నేర్చుకున్న పాఠాలు ఏంటి?

ABN, Publish Date - Apr 04 , 2026 | 10:35 AM

యాంకర్‌ రష్మీ గౌతమ్‌.. బుల్లితెరపై తిరుగులేని యాంకర్‌గా గుర్తింపు పొందారు. జబర్దస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో పాటు మరెన్నో కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారామె.

యాంకర్‌ రష్మీ గౌతమ్‌ (Rashmi Gautham).. బుల్లితెరపై తిరుగులేని యాంకర్‌గా గుర్తింపు పొందారు. జబర్దస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో పాటు మరెన్నో కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారామె. రష్మీకి సేవా గుణం కూడా ఎక్కువే. ఇటీవల ఆమె వర్క్‌కు గ్యాప్‌ ఇచ్చి వెకేషన్‌కి వెళ్లారు. జనరల్‌గా వెకేషన్‌ అనగానే మాల్దీవులు, గోవా, అండమాన్‌ ఇలాంటి ప్రాంతాల పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కానీ రష్మీ మాత్రం కాశీ క్షేత్రానికి వెళ్లారు. అక్కడి ఘాట్స్‌ లో తిరిగారు. గంగా హారతుల్లో పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె భావోద్వేగ పోస్ట్‌ పెట్టారు.

‘ఇప్పుడు నా ముఖంలో నవ్వును చూసి ఆశ్చర్యపడవచ్చు. దాని వెనక బలమైన కారణమే ఉంది. వారణాసి యాత్రలో ఇది చివరి రోజు. ఏడాదిలోపు ఇక్కడికి రావడం ఇది రెండోసారి. ఇంతకుముందు కాశీకి భారమైన మనసుతో వెళ్లాను. అతి తక్కువ సమయంలో నాకు ప్రియమైన వారిని కోల్పోయాను. ఆ బాధను నా మనసు తట్టుకోలేకపోయింది. వారిని విడిచిపెట్టడం నాకెందుకో సాధ్యపడలేదు. అందుకే అప్పుడు కాశీకి వెళ్లాను. ఆధ్యాత్మిక యాత్ర అనేది మనం అనుకుంటే జరిగేది కాదు. దానికి పరమశక్తి అనుమతిస్తేనే జరుగుతుంది. అయితే మన చేతిలో ఏదీ ఉండదు అన్నది నిజం. గత కాశీ యాత్రతో పోలిస్తే ఈ సారి నాలో చాలా మార్పు వచ్చింది. జీవిత సత్యం తెలిసింది. మన జీవితంలోకి మనుషులు రావడం, పోవడం అనేది సహజమని అర్థం చేసుకున్నాను. అది ఎదుగుదలలో ఒక దశ. బాధను మనసులోనే పెట్టుకుని కూర్చుంటే అది మన ఎదుగుదలను తగ్గిస్తుంది. జాగ్రత్తగా, అవగాహనతో ముందుకెళ్లడం ఎంత ముఖ్యమో నేర్చుకున్నాను. ఈ కొన్ని నెలల్లో నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలు ఇవే’ అని రష్మిక పేర్కొన్నారు. అయితే రష్మిక దేనిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Apr 04 , 2026 | 02:10 PM