రారా ధీవ‌ర‌.. స్వ‌యంభూ నుంచి లిరిక‌ల్ వీడియో

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:01 PM

నిఖిల్, సంయుక్త, న‌భా న‌టేశ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న భారీ పీరియ‌డ్‌, అడ్వెంచ‌ర్ యాక్ష‌న్ డ్రామా స్వ‌యంభూ.

Rara Dheevara

నిఖిల్ (Nikhil Siddhartha), సంయుక్త (Samyuktha), న‌భా న‌టేశ్ (Nabha Natesh) ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న భారీ పీరియ‌డ్‌, అడ్వెంచ‌ర్ యాక్ష‌న్ డ్రామా చిత్రం స్వ‌యంభూ (Swayambhu). భ‌ర‌త్ కృష్ణ‌మాచారి (bharat krishnamachari) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ అతి త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది.

ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ప్రారంభించింది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజ‌ర్ మంచి రెస్పాన్స్ తీసుకు రాగా సినిమాపై అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. అంతేగాక ఇటీవ‌ల విడుద‌ల చేసిన పాట‌లు సైతం మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే ఈ మూవీ నుంచి రారా ధీవ‌రా లేరా లేవ‌రా విజృంభించ‌రా స్వ‌ప్నం సాధించ‌రా (Rara Dheevara) అంటూ సాగే ఇన్సిపిరేష‌న‌ల్‌ పాట‌ను గురువారం సాయంత్రం విడుద‌ల చేశారు. నిఖిల్, న‌భా, వంద‌ల మంది డ్యాన్స‌ర్ల‌పై చిత్రీక‌రించిన ఈ పాట ఆద్యంతం ఆక‌ట్టుకునేలా, అదిరిపోయే స్టెప్పుల‌తో సాగింది. ఈ పాట‌కు రామ‌జోగ‌య్య శాస్త్రి (Ramajogayya Sastry) సాహిత్యం అందించ‌గా ర‌వి బ‌స్రూర్ (Ravi Basrur) స్వరకల్పనలో సంతోష్ వెంకీ (Santhosh Venky) ఆల‌పించారు.

Updated Date - Apr 17 , 2026 | 12:49 PM