సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

జబర్దస్త్ మహేష్ విడాకుల రచ్చ..

ABN, Publish Date - Jun 27 , 2026 | 08:36 PM

ప్రస్తుతం దేనికైనా ప్రమోషన్ అనేది చాలా అవసరం. ఆ ప్రమోషన్ ఎంత కొత్తగా చేస్తే.. ప్రేక్షకులను అంత ఈజీగా చేరుకోవచ్చు. ఇండస్ట్రీలో ఇది అందరూ చేసేదే.

Mahesh

ప్రస్తుతం దేనికైనా ప్రమోషన్ అనేది చాలా అవసరం. ఆ ప్రమోషన్ ఎంత కొత్తగా చేస్తే.. ప్రేక్షకులను అంత ఈజీగా చేరుకోవచ్చు. ఇండస్ట్రీలో ఇది అందరూ చేసేదే. కొన్నిసార్లు ఫ్రాంక్ ల పేరుతో స్టార్స్ చాలా పనులు చేశారు. వాటిని నిజం అనుకోని ప్రేక్షకులు అరెరే .. ఏమయ్యిందో పాపం అని సానుభూతి చూపించేవారు. ఆ తరువాత అది ఫ్రాంక్ అని తెలిసి మండిపడేవారు. ఇప్పుడు రంగస్థలం మహేష్ (Mahesh) పై కూడా ఇలానే మండిపడుతున్నారు.


జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్. రంగస్థలం సినిమాలో చరణ్ పక్కన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో, షోస్ తో బిజీగా ఉన్న మహేష్ సడెన్ గా ఒక వీడియో పోస్ట్ చేశాడు. నిజానిజాలు తెలియకుండా సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడొద్దని, అన్ని నిజాలు త్వరలోనే చెప్తానని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. దీంతో అతనిని ఫాలో అయ్యేవారు.. మహేష్ కి ఏమైంది..? కొంపతీసి సూసైడ్ ఏమైనా చేసుకుంటాడా.. ? అంత బాధలో మాట్లాడుతున్నాడు అనుకున్నారు. ఇంట్లో సమస్య.. కెరీర్ లో సమస్యనా అని సోషల్ మీడియాలో ఆరాలు తీయడం కూడా జరిగింది.


ఇక ఆ వీడియో తరువాత.. భార్యాభర్తల గొడవలను కలిపే ప్రోగ్రామ్ కి వెళ్లినట్లు ఒక వీడియో పోస్ట్ చేశాడు. అక్కడ అమ్మాయి ముఖం చూపించకుండా.. మహేష్ విడాకుల కోసం గొడవపడ్డాడు. అడ్డమైన బూతులు మాట్లాడుతూ కంగారు పెట్టాడు. అయితే ఇదంతా నిజమా అనుకుంటే.. లేదు ఇదొక ప్రమోషన్. మహేష్ నటించిన షాట్ సిరీస్ డి ఫర్ డివోర్స్ అనే సిరీస్ కోసం ఇదంతా చేశాడు. ఇక ఈ విషయం తెలియడంతో చాలామంది మహేష్ పై మండిపడుతున్నారు. నిజంగా ఆ వీడియోని నమ్మి కంగారు పడిన వాళ్ల పరిస్థితి ఏంటి.. ఆలోచించావా.. మరీ ప్రమోషన్ కోసం ఇంతగా దిగజారతారా ఛీఛీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు అయ్యా.. నీ నటనకు హ్యాట్సాఫ్ అందరూ నిజమే అనుకున్నారు అని అంటున్నారు. ప్రమోషన్స్ చేయొచ్చు కానీ, మరీ ఈ రేంజ్ లో అయితే కష్టమని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.

Updated Date - Jun 27 , 2026 | 08:54 PM