రాజమౌళి 'రాముడు'.. ముందు రణబీర్ తేలిపోయాడా?
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:40 AM
భారతీయ ఇతిహాసాల్లో రామాయణానికి ఉన్న స్థానం అజరామరం. ఎన్నిసార్లు విన్నా, ఎన్ని వందల సినిమాలు తీసినా రాముడి కథ అంటే భారతీయులకు ఒక ఎమోషన్.
భారతీయ ఇతిహాసాల్లో రామాయణానికి ఉన్న స్థానం అజరామరం. ఎన్నిసార్లు విన్నా, ఎన్ని వందల సినిమాలు తీసినా రాముడి కథ అంటే భారతీయులకు ఒక ఎమోషన్. వెండితెరపై రాముడిగా కనిపించే నటుడిని ప్రేక్షకులు కేవలం హీరోగా మాత్రమే చూడరు.. సాక్షాత్తు ఆ దేవుడి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే ఆ పాత్రను ఎవరు పోషించినా భారీ అంచనాలతో పాటు అంతే స్థాయిలో విమర్శలు కూడా వస్తుంటాయి. సరిగ్గా ఇప్పుడే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే.. నితీష్ తివారీ రూపొందిస్తున్న రామాయణ్ (Ramayana) వర్సెస్ రాజమౌళి (S. S. Rajamouli) ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి (Varanasi).
నితీష్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో రణబీర్ కపూర్ (Ranbir kapoor)రాముడిగా నటిస్తున్న రామాయణ్ టీజర్ హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైంది. ఎటువంటి డైలాగ్స్ లేకుండా, అద్భుతమైన విజువల్స్, మ్యూజిక్‌తో ఈ గ్లింప్స్ ప్రేక్షకులను పలకరించింది. రణబీర్ లుక్ చాలా సాఫ్ట్‌గా, ప్రశాంతంగా ఉందంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకు తగ్గట్టే విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. అయితే, ఎంత పాజిటివిటీ వస్తుందో.. సోషల్ మీడియాలో కొంత నెగిటివిటీ కూడా అంతే స్థాయిలో వినిపిస్తోంది. దానికి కారణం రణబీర్ పర్సనాలిటీ ఈ పాత్రకు సెట్ అవుతుందా లేదా అన్న సందేహం కొందరిలో ఉండటమే.
సరిగ్గా రణబీర్ టీజర్ వచ్చిన సమయంలోనే, అటు రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న వారణాసి గ్లింప్స్ కూడా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో దాదాపు 30 నిమిషాల పాటు రామాయణానికి సంబంధించిన ఒక కీలక ఘట్టం ఉంటుందని జక్కన్న ప్రకటించినప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్ర ప్రీ-గ్లింప్స్ చూసిన ఆడియెన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే అందులో రామాయణ ఘట్టాన్ని రాజమౌళి చూపించిన విధానం న భూతో న భవిష్యతి అనేలా ఉంది. గ్లింప్స్ రిలీజై 5 నెలలు కావస్తున్నా ఇప్పటికీ వారణాసి విజువల్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.
మహేష్ బాబు (Mahesh Babu) రాముడి లుక్ ఇంకా అఫీషియల్ గా రాకపోయినా, ఫ్యాన్ మేడ్ పోస్టర్లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. రణబీర్ లుక్ క్లాసిక్‌గా ఉంటే, మహేష్ బాబులో ఒక రకమైన దైవిక తేజస్సు కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి బ్రాండ్ వాల్యూ తోడవ్వడంతో వారణాసి గ్లింప్స్ పక్కా పాజిటివిటీతో దూసుకుపోతోంది. సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే.. రాజమౌళి స్క్రీన్ మీద ఏదైనా చూపిస్తున్నారంటే అందులో ఒక ఎమోషన్, ఒక పవర్‌ఫుల్ విజువల్ ట్రీట్ ఉంటుంది.
అదే ఇప్పుడు రణబీర్ సినిమాకు పెద్ద సవాల్‌గా మారింది. చివరికి ఏ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది..? నితీష్ తివారీ భక్తిరసంతో కూడిన విజువల్ వండరా.. లేక రాజమౌళి మార్క్ హై-వోల్టేజ్ రామాయణమా..? రణబీర్ రాముడిగా మెప్పిస్తాడా..? లేక మహేష్ బాబు తన లుక్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తాడా..? ఏది ఏమైనా భారతీయ సినిమా ఇండస్ట్రీలో రామాయణం మళ్ళీ ఒక పెను సంచలనం సృష్టించబోతోంది.