Vijay Devarakonda: ‘రణబాలి’ టీజర్ ఎప్పుడంటే.. కొత్త పోస్టర్‌తో క్లారిటీ!
ABN, Publish Date - Sep 07 , 2026 | 04:48 PM
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ టీజర్ వచ్చే డేట్ ఫిక్స్ అయింది.
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్ర కథను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. చారిత్రక నేపథ్యానికి యాక్షన్, డ్రామాను జోడించి రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రష్మిక కథానాయికగా నటిస్తుండగా.. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలు షురూ చేసింది. ఇందులో భాగంగా సినిమా టీజర్ విడుదల తేదీని ప్రకటించింది. సెప్టెంబరు 9న ‘రణబాలి’ టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సోమవారం కొత్త పోస్టర్ తో వెల్లడించింది.