సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ranabali: గండికోటలో అంతా అయిపోయింది 

ABN, Publish Date - Jun 06 , 2026 | 01:38 PM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'రణబాలి' తాజా షెడ్యూల్ పూర్తయింది.  

Ranabaali

విజయ్ దేవరకొండ9Vijay Devarakonda), రష్మిక మందన్న (Rashmika mandanna) జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'రణబాలి' (Ranabali). రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా  సక్సెస్ ఫుల్ గా వంద రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవల గండికోటలో షెడ్యూల్ జరిగింది.


వారం రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ రూపొందించారు. ఇప్పటి దాకా ఈ చిత్రానికి సంబంధించిన 90 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఔట్ పుట్ పూర్తి సంతృప్తికరంగా వచ్చిందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ లోని ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ సీక్వెన్స్  సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి:

‘పెద్ది’ పాత్రను ఎగతాళి చేసే వాళ్లంతా.. ముందు ఇది తెలుసుకోండి!

పవన్ కళ్యాణ్‌ని ‘దొర’ అంటావా.. ప్రకాశ్ రాజ్‌కి ఇచ్చిపడేసిన హేమ!

మీరు నిజంగానే పోరాడారు.. ‘పెద్ది’పై పవన్ కళ్యాణ్ బ్యానర్ పోస్ట్!

Updated Date - Jun 06 , 2026 | 04:34 PM