సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రణబాలి.. బ్రిటిషర్లు రైల్వేల వెనుక దాచిన చేదు నిజం ఇది

ABN, Publish Date - Sep 30 , 2026 | 07:25 PM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా, దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం రణబాలి(Ranabaali).

Ranabaali

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా, దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం రణబాలి(Ranabaali). మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 16 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇపపాటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన మేకర్స్.. రణబాలి డాక్యుమెంటరీ పేరుతో నాలుగు మేకింగ్ వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రూత్ 1 రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. తాజాగా ట్రూత్ 2 ను మేకర్స్ విడుదల చేశారు.


ట్రూత్ 2 .. ది హిస్టరీ వి ఫర్ గాట్ వీడియోలో విజయ్ దేవరకొండ మన చరిత్ర పుస్తకాల్లో చూపించని ఒక చేదు నిజాన్ని బయటపెట్టాడు. 'బ్రిటిష్ వారు మన దేశంలో రైల్వే వ్యవస్థను తీసుకొచ్చారని మాత్రమే మనం పాఠాల్లో చదువుకున్నాం. కానీ దేనికోసం తీసుకొచ్చారనేది ఎవరూ చెప్పలేదు. మన భారతీయ పన్నుల డబ్బుతో, మన కార్మికుల శ్రమతో నిర్మించిన ఆ రైల్వే మార్గాల ద్వారా మన దేశంలోని ధాన్యం, పత్తి, సుగంధ ద్రవ్యాలు, బంగారాన్ని దోచుకెళ్లడానికి మాత్రమే వారు రైళ్లను ఉపయోగించారు 'అని విజయ్ చెప్పుకొచ్చాడు.


ఇక ఈ చారిత్రక అంశంపై రష్మిక మందన్న మాట్లాడుతూ.. ఈ కాలం నాటి విషయాల గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు, మన చరిత్రలోని ఇలాంటి అనేక ఘట్టాలను ఉద్దేశపూర్వకంగానే మర్చిపోయేలా చేశారనిపించిందని వ్యాఖ్యానించింది. 1878 నాటి పరిస్థితుల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తదుపరి ప్రమోషనల్ కంటెంట్ ట్రూత్ 3 .. ది మెన్ వి ఫర్ గాట్ అప్‌డేట్‌ను అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేకింగ్ వీడియోలు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Sep 30 , 2026 | 07:25 PM