Rana Daggubati: మిరాయ్ సీక్వెల్‌లో భళ్లాలదేవ..!
ABN, Publish Date - May 21 , 2026 | 12:09 PM
తక్కువ టైమ్‌లోనే పాన్ ఇండియా లెవెల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో.. తేజ సజ్జా!
తక్కువ టైమ్‌లోనే పాన్ ఇండియా లెవెల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో.. తేజ సజ్జా (Teja Sajja) టాలీవుడ్ టాప్ హీరోలకు సైతం సాధ్యం కాని రీతిలో, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఈ యంగ్ స్టార్. జాంబీ రెడ్డితో మొదలైన ఇతని సంచలనం, హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా వైడ్‌గా మారుమ్రోగింది. ఇక గతేడాది విడుదలైన మిరాయ్ (Mirai) సినిమా కూడా ఊహించని విధంగా వంద కోట్ల క్లబ్‌లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ విజువల్ వండర్, బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను సృష్టించింది. అయితే.. ఇప్పుడు ఫిలింనగర్ నుంచి వినిపిస్తున్న ఒక క్రేజీ వార్త టాలీవుడ్‌ను ఊపేస్తోంది. ఈ సంచలన చిత్రానికి సంబంధించిన సీక్వెల్ పనులు చాలా సైలెంట్‌గా మొదలైపోయాయట..!
సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే, దానికి సీక్వెల్ తీయడానికి చాలా టైమ్ తీసుకుంటారు. కానీ మిరాయ్ టీమ్ మాత్రం అస్సలు ఆలస్యం చేయడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో జై హనుమాన్ చిత్రాన్ని పట్టాలెక్కించిన తేజ సజ్జా, ఇప్పుడు అంతే వేగంగా మిరాయ్ సీక్వెల్‌ను కూడా లైన్లో పెట్టేసాడు. దీనికి గల ముఖ్య కారణం.. ఈ సినిమాకు అవసరమయ్యే భారీ విజువల్ ఎఫెక్ట్స్. ప్రస్తుత రోజుల్లో గ్రాఫిక్స్, సీజీ వర్క్‌కు చాలా ఎక్కువ సమయం పడుతోంది. అందుకే మూవీ టీమ్ ఒక స్మార్ట్ డెసిషన్ తీసుకుంది. సినిమాలోని అత్యంత కీలకమైన సీజీ షాట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్‌కు సంబంధించిన రా ఫుటేజ్‌ను ఇప్పుడే చిత్రీకరించడం ప్రారంభించారట. ఇలా చేయడం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎలాంటి ఆలస్యం లేకుండా, అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సీక్వెల్‌లో అసలైన హైలైట్ ఏంటో తెలుసా..? బాహుబలిలో భళ్లాలదేవగా గడగడలాడించిన దగ్గుబాటి రానా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మిరాయ్ క్లైమాక్స్‌లోనే రానాకు సంబంధించిన కొన్ని స్పెషల్ సీన్స్‌ను రిలీజ్ చేసి, కావాల్సిన హైప్‌ను తీసుకొచ్చారు. (Rana Daggubati)
గత కొంతకాలంగా టాలీవుడ్ సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న రానా.. ఈ పవర్‌ఫుల్ రోల్‌తో మళ్లీ బాక్సాఫీస్ దగ్గర గట్టి కంబ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రానా స్క్రీన్ ప్రెజెన్స్, తేజ సజ్జా ఎనర్జీ తోడైతే థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ. ఈ ఒక్క అప్‌డేట్‌తోనే 'మిరాయ్' సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కేవలం మిరాయ్ సీక్వెల్ మాత్రమే కాదు.. తేజ సజ్జా ఖాతాలో జాంబీ రెడ్డి సీక్వెల్ కూడా లైన్లో ఉంది. అంటే రాబోయే రోజుల్లో తేజ సజ్జా నుంచి వరుసగా క్రేజీ సీక్వెల్స్ రాబోతున్నాయన్నమాట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాలను నిర్మిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ క్వాలిటీతో ఈ చిత్రాలను రూపొందించడానికి పీపుల్ మీడియా సంస్థ భారీగా ఖర్చు చేస్తోంది.