యన్టీఆర్ వర్సెస్ రామ్ చరణ్! అటు పెద్ది ట్రైలర్ ఇటు డ్రాగన్ గ్లింప్స్
ABN, Publish Date - May 13 , 2026 | 10:13 AM
రియల్ లైఫ్‌లో అన్నదమ్ముల్లా మసలే స్టార్స్- బాక్సాఫీస్ బరిలో మాత్రం ఢీ అంటే ఢీ అని సాగుతారు. అది చూసి వారి ఫ్యాన్స్ మధ్య వార్స్ అనివార్యమవుతూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి పోటీ ఒకటి చోటు చేసుకోబోతోంది. ఆ ముచ్చటేంటో మరి?
యంగ్ టైగర్ యన్టీఆర్ (Ntr), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఇద్దరూ రీల్ లైఫ్‌లో ఎంత పోటీ పడి నటించినా, రియల్ లైఫ్ లో అన్నదమ్ముల్లా క్లోజ్ గా ఉంటారు. అందుకే వారిద్దరూ కలసి ఈ తరం ప్రేక్షకులకు అసలు సిసలు మల్టీస్టారర్ గా 'ట్రిపుల్ ఆర్'ను అందించారు. వీరిద్దరితో రాజమౌళి చేసిన మ్యాజిక్ , కీరవాణి మ్యూజిక్ 'ట్రిపుల్ ఆర్'ను ఆస్కార్ బరిలోనూ విజేతగా నిలిపింది. అందులో జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ ఎంతలా పోటీ పడి నటించారో అందరికీ తెలిసిందే. అలాంటి తారక్, చెర్రీ ఇప్పుడు తమ సినిమాల ప్రచారచిత్రాలతో పోటీ పడబోతున్నారు. ఒక్క రోజు తేడాతో ఈ పబ్లిసిటీ వార్ సాగనుంది.
'ట్రిపుల్ ఆర్' మూవీ తరువాత రామ్ చరణ్ నటించిన 'ఆచార్య, గేమ్ చేంజర్' రెండు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. చెర్రీ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన హిందీ చిత్రం 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' కూడా ఫ్లాప్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ రాబోయే చిత్రం పెద్ది (Peddi)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బుచ్చిబాబు సాసా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ జూన్ 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను మే 18వ తేదీన విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఎ.ఆర్.రహమాన్ బాణీల్లో రూపొందిన 'పెద్ది' పాటలు పరవశింప చేస్తున్నాయి. 'పెద్ది' ట్రైలర్ ను కూడా చూడటానికి ఫ్యాన్స్ తహతహ లాడుతున్నారు. 'పెద్ది' ట్రైలర్ రిలీజైన మరుసటి రోజునే అంటే మే 19 అర్ధరాత్రికి యన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ గ్లింప్స్ రిలీజ్ కానుందట. ఒక్క రోజు తేడాతో 'ట్రిపుల్ ఆర్' మూవీ స్టార్స్ పబ్లిసిటీ మూవీస్ మధ్య పోటీ చోటు చేసుకోవడం విశేషంగా మారింది.
ఫ్యాన్స్ లో ఆసక్తి..
యన్టీఆర్- ప్రశాంత్ నీల్ (Prashanth Neel) మూవీకి చాలా రోజుల నుంచీ డ్రాగన్ (Dragon) అనే టైటిల్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి దాకా మేకర్స్ ఈ సినిమా పేరును ప్రకటించలేదు. మే 20న యంగ్ టైగర్ బర్త్ డే. ఈ సందర్బంగా యన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ కానుంది. అందులో తప్పకుండా మూవీ టైటిల్ ను ప్రకటిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
యన్టీఆర్ బర్త్ డే మే 20 తేదీ అంటే 19వ తేదీ అర్ధరాత్రి 12 గంటలు దాటగానే గ్లింప్స్ రిలీజ్ కానుందని సమాచారం. చెర్రీ 'పెద్ది' ట్రైలర్ మే 18న, యన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ గ్లింప్స్ మే 19న వరుసగా వస్తూ ఉండడంతో అభిమానుల్లో ఆసక్తి కలుగుతోంది. ఈ రెండింటిలో ఏది వ్యూయర్స్ ను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తుందో అని ఫ్యాన్స్ ఆత్రంగా చూస్తున్నారు. ఈ ప్రచార చిత్రాల మధ్య పోటీ ఏ తీరున సాగుతుందో చూద్దాం.