చరణ్ - సుకుమార్ మూవీ మైథాలజీ కథతోనా..?
ABN, Publish Date - Oct 06 , 2026 | 04:42 PM
చరణ్‌ను ఇదివరకు ఎన్నడూ చూడని సరికొత్త పవర్‌ఫుల్ అవతారంలో ఆవిష్కరించేందుకు సుకుమార్ ఒక సాలిడ్ కథను సిద్ధం చేసినట్లు వినికిడి.
‘రంగస్థలం’.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. 'చిట్టిబాబు' పాత్రకు రామ్ చరణ్ (Ram Charan) ప్రాణం పోస్తే, సుకుమార్ (Sukumar) తన రా అండ్ రస్టిక్ టేకింగ్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆ ఇండస్ట్రీ హిట్ తర్వాత, మళ్లీ వీరిద్దరి కలయికలో రాబోతున్న ప్రాజెక్ట్ 'RC 17'. ముఖ్యంగా 'పుష్ప 2' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత డైరెక్టర్ సుకుమార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. చరణ్‌ను ఇదివరకు ఎన్నడూ చూడని సరికొత్త పవర్‌ఫుల్ అవతారంలో ఆవిష్కరించేందుకు ఒక సాలిడ్ కథను సిద్ధం చేసినట్లు వినికిడి.
అయితే, గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి రోజుకో క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కథకు సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ లీకైంది. గతంలో 'RC 17' ఒక ఇంటెన్స్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రాబోతోందని ప్రచారం జరిగింది. కానీ, లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందట.
సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఇప్పటికే పలు వెర్షన్లు సిద్ధం చేయగా, అందులో ఈ మైథాలజీ టచ్ ఉన్న లైన్ చాలా బాగా వచ్చిందని టాక్. నిజానికి రామ్ చరణ్ పవర్‌ఫుల్ మైథాలజీ రోల్‌లో ఉంటే చూడాలని ఫ్యాన్స్ చాలా కాలంగా కోరుకుంటున్నారు. చరణ్ ఆరాకు తగ్గట్టుగా సుకుమార్ గనుక ఒక సాలిడ్ కాన్సెప్ట్ ప్లాన్ చేస్తే.. బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇక ఈ ప్రాజెక్ట్ కోసం సుకుమార్ ఒక కొత్త సంగీత దర్శకుడి వైపు మొగ్గు చూపుతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటివరకు సుకుమార్ సినిమా అంటే అక్కడ కచ్చితంగా ఉండాల్సింది రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్. కానీ ఈసారి మైథాలజీ బ్యాక్‌డ్రాప్ కావడం వల్ల కొత్త రకమైన మ్యూజిక్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నారట. అందుకే కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌ను ఎంచుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా 'ధురంధర్' ఫేమ్ సారా అర్జున్, కియారా అద్వానీ, రష్మిక మందన్న, రుక్మిణి వసంత్ వంటి క్రేజీ బ్యూటీల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి వీరిలో చరణ్ పక్కన ఛాన్స్ కొట్టేసే ఆ లక్కీ హీరోయిన్ ఎవరో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో, ఒక విజువల్ వండర్‌గా నిర్మించనున్నాయి. ఇక దసరా పండుగ కానుకగా ఈ సినిమా ముహూర్త కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభం కానుందని ఇన్సైడ్ టాక్. పూజా కార్యక్రమాల రోజే కాస్టింగ్, టెక్నీషియన్లతో పాటు కథకు సంబంధించిన పూర్తి వివరాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌తో 'RC 17' గనుక వస్తే.. అది రంగస్థలాన్ని మించిన ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. మరి సుకుమార్ మన ముందుకు ఎలాంటి కథతో వస్తారు? చరణ్‌ను ఎలా చూపిస్తారు? అనేది తెలియాలంటే దసరా వరకు వెయిట్ చేయాల్సిందే.