Peddi: స్పెషల్ సాంగ్.. విజువల్స్ లీక్! షాక్‌లో ‘పెద్ది’ టీం
ABN, Publish Date - Apr 28 , 2026 | 02:57 PM
‘పెద్ది’ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో రాబోతున్న భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’(Peddi). ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్‌డేట్ సోషల్ మీడియాలో నిత్యం ట్రెండ్ అవుతూనే ఉంది. రామ్ చరణ్ ఊర మాస్ లుక్‌లో కనిపించబోతుండటంతో మెగా అభిమానుల్లో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాల చిత్రీకరణ సమయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, అప్పుడప్పుడు సెట్స్ నుంచి ఫోటోలు లేదా వీడియోలు లీక్ అవుతుంటాయి. ఇప్పుడు ‘పెద్ది’ సినిమా కూడా ఈ లీక్ బారిన పడింది. ఈ చిత్రంలోని ఒక పవర్ ఫుల్ మాస్ బీట్ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇది సినిమాలో వచ్చే ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ అని, ఈ పాట సినిమాకే హైలెట్ అవుతుందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఈ స్పెషల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఫైనల్‌గా హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) ఈ పాటలో రామ్ చరణ్‌తో కలిసి చిందేస్తుంది. భారీ సెట్ వేసి షూటింగ్ జరుపుతుండగా, చరణ్ - శృతి రిహార్సల్స్ చేస్తున్న సమయంలో ఎవరో టాప్ యాంగిల్ నుంచి సీక్రెట్‌గా మొబైల్‌లో రికార్డ్ చేసి లీక్ చేశారు. కేవలం కొద్ది సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది.
ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (A R Rahman) ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్, చికిరి, రాయ్ రాయ్ రా రా, పహిల్వాన్ వీడియో సినిమాపై భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేశాయి. రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
అన్ని అడ్డంకులను అధిగమించి, శరవేగంగా పనులు పూర్తి చేసుకుంటున్న ‘పెద్ది’ చిత్రం ఈ ఏడాది జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. గతంలో ‘ఉప్పెన’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు, ఇప్పుడు రామ్ చరణ్‌ను ఏ విధంగా ప్రెజెంట్ చేస్తారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మాస్ మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే జూన్ వరకు వేచి చూడాల్సిందే.