సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పెద్ది రాక‌పై.. చ‌ర‌ణ్‌ క్లారిటీ! ఇంకా.. ఎన్నో డౌట‌నుమానాలు

ABN, Publish Date - Apr 02 , 2026 | 08:26 PM

పెద్ది రిలీజ్ డేట్ విషయంలో గందరగోళం నెలకొంది. అసలు పెద్ది బరిలో ఉందా..? లేక వెనక్కి తగ్గిందా..? ఇప్పుడు ఇదే టాలీవుడ్‌లో హాట్ టాపిక్!

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా పెద్ది (Peddi ). బుచ్చిబాబు సాన (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే గత కొద్దిరోజులుగా ఈ సినిమా గురించి నెట్టింట రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా రిలీజ్ డేట్ విషయంలో గందరగోళం నెలకొంది. అసలు పెద్ది బరిలో ఉందా..? లేక వెనక్కి తగ్గిందా..? ఇప్పుడు ఇదే టాలీవుడ్‌లో హాట్ టాపిక్!

నిన్నటి వరకు సోషల్ మీడియాలో ఒక్కటే వార్త.. పెద్ది వాయిదా పడుతోంది, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అవుతోంది అంటూ ప్రచారం జోరుగా సాగింది. దీంతో మెగా అభిమానులు కాస్త నిరాశ చెందారు. కానీ, అనూహ్యంగా రాకాస ప్రమోషనల్ వీడియోతో సీన్ మొత్తం మారిపోయింది. పెద్ది వాయిదా పడుతుందనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అంతా అనుకున్నట్లుగానే సాగుతోందని ఆ వీడియోలో రామ్‌చరణ్‌ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఏప్రిల్ 30న బాక్సాఫీస్ దగ్గర పెద్ది సందడి చేయడం ఖాయమని అనేకమంది భావిస్తున్నారు.

రామ్ చరణ్ రిలీజ్ విషయంలో డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చినా, చిత్ర నిర్మాతలు మాత్రం ఇప్పటికీ అధికారికంగా స్పందించడం లేదు. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా కేవలం శుభాకాంక్షలు మాత్రమే ఉన్నాయి కానీ, రిలీజ్ డేట్ ప్రస్తావన లేదు. దీంతో అభిమానులు మళ్ళీ తలలు పట్టుకుంటున్నారు. చరణ్ మాటలకు, మేకర్స్ ఇస్తున్న పోస్టర్లకు ఎక్కడా పొంతన కుదరడం లేదని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పెద్ది వాయిదా పడుతుందనే నమ్మకంతో మే 1వ తేదీని టార్గెట్ చేస్తూ కొన్ని చిన్న సినిమాలతో పాటు, కొన్ని డబ్బింగ్‌ సినిమాలు కూడా తమ రిలీజ్ డేట్స్ ను ప్లాన్ చేసుకున్నాయి. ఒకవేళ పెద్ది ఏప్రిల్ 30న వస్తే, ఆ సినిమాల పరిస్థితి ఏంటి..? మెగా పవర్ స్టార్ లాంటి భారీ సినిమా పోటీలో ఉంటే చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టమే. అలాగే వసూళ్లపై కూడా గట్టి ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఆ సినిమాల నిర్మాతలు "ముందు నుయ్యి వెనుక గొయ్యి" అన్నట్లుగా తలలు పట్టుకుంటున్నారు. ఇక లోపల జరుగుతున్న విషయం ఏంటంటే.. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి.

టెక్నికల్ గా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బుచ్చిబాబు టీమ్ రేయింబవళ్లు శ్రమిస్తోంది. సినిమా వాయిదా వేయడం కంటే, అనుకున్న సమయానికే రావాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా సైలెంట్ గా పనులు పూర్తి చేస్తున్నారు. ఏది ఏమైనా, పెద్ది సినిమా కోసం అటు ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీ వర్గాలు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నాయి. ఏప్రిల్ 30న చరణ్ పెద్దితో బాక్సాఫీస్ పై విరుచుకుపడతాడా..? లేక చివరి నిమిషంలో ఏమైనా మార్పులు ఉంటాయా..? తెలియాలంటే మేకర్స్ ఇచ్చే అఫీషియల్ అప్డేట్ వరకు ఆగాల్సిందే.

Updated Date - Apr 02 , 2026 | 08:31 PM