రామాయణం vs ఆదిపురుష్.. ఓం రౌత్‌పై మళ్లీ ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్!
ABN , Publish Date - Nov 10 , 2026 | 04:04 PM
రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటించిన రామాయణం విజయంతో ప్రభాస్ ఆదిపురుష్ మరోసారి చర్చలోకి వచ్చింది.
ఇటీవల దీపావళి పర్వదినానికి ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన రామాయణం (Ramayana Movie) చిత్ర విజయంతో మరోసారి ప్రభాస్ (Prabhas)నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా ప్రస్తావన తెరపైకి వచ్చింది. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన రామాయణంలో విజువల్ ఎఫెక్ట్స్, సాంకేతికతను ఉపయోగించిన విధానంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో గతంలో ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్‌పై ప్రభాస్ అభిమానులు మరోసారి విమర్శలు గుప్పిస్తున్నారు. రామాయణం వంటి ఇతిహాసాన్ని తెరపైకి తీసుకొచ్చేటప్పుడు కథలోని గొప్పదనాన్ని, పాత్రల ఔన్నత్యాన్ని కాపాడాల్సిన అవసరం మేకర్స్‌కు ఉందని అభిప్రాయ పడుతున్నారు.
ఆదిపురుష్‌లో డార్క్ షేడ్స్, గ్రాఫిక్స్, పాత్రల చిత్రణ విషయంలో జరిగిన పొరపాట్లు ప్రభాస్ ఇమేజ్‌పై ప్రభావం చూపాయని ఫ్యాన్స్ విమర్శించారు. ఇప్పుడు కొత్తగా రామాయణం రూపంలో మరో భారీ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ రెండు చిత్రాల మధ్య పోలికలు పెరిగాయి. అయితే రామాయణం విజయం వెనుక కేవలం సాంకేతికత మాత్రమే కాకుండా, భారతీయ ఇతిహాస కథకు ఉన్న ఆదరణ కూడా కీలకం అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.
మొత్తానికి సెలవులు ముగిసిన తర్వాత కూడా రామాయణం బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం తగ్గడం లేదు. ఫస్ట్ మండే రికార్డులు, బుక్‌మైషో టికెట్ విక్రయాలు, దీపావళి వసూళ్లు చూస్తుంటే ఈ సినిమా ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో మరెన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.