సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

దర్శకుడవుతున్న రామ్‌... అతి త్వరలో మహూర్తం!

ABN, Publish Date - May 12 , 2026 | 10:38 AM

యంగ్ హీరోస్ కొందరు మెగాఫోన్ పట్టి డైరెక్టర్స్ కావాలని తపిస్తున్నారు. ఆ జట్టులో చేరబోతున్నారు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ఇంతకూ రామ్ మెగాఫోన్ పట్టేది ఎప్పుడో?

Ram Pothineni

నటునిగా మంచి మార్కులే సంపాదిస్తున్నారు రామ్ పోతినేని (Ram Pothineni). అయితే ఆశించిన స్థాయిలో ఆయన నటించిన చిత్రాలు ఆకట్టుకోలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి అన్నట్టు రామ్ పోతినేని మెగాఫోన్ పట్టబోతున్నారట. తానే నిర్మాతగా, నటునిగా, దర్శకునిగా త్రిపాత్రాభినయం చేసి ఆకట్టుకొనే ప్రయత్నంలో రామ్ ఉన్నారని విశేషంగా వినిపిస్తోంది. మే 15వతేదీన రామ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన దర్శకత్వం వహించబోయే సినిమా అనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తోంది. నటునిగా తానేమిటో నిరూపించుకున్న రామ్ దర్శకునిగా ఏ తీరున సాగుతారో అన్న ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది.

నటులు దర్శకులుగా మారడం అన్నది తెలుగు సినిమా తొలి రోజుల నాటి నుంచీ ఉంది. ఇక స్టార్స్ డైరెక్టర్స్ గా మారడం మహానటుడు చిత్తూరు వి.నాగయ్యతోనే మొదలయింది. ఆ తరువాత మరో మహానటుడు నటరత్న యన్టీఆర్ (NTR) కూడా దర్శకునిగా జైత్రయాత్ర చేశారు. వీరి బాటలోనే నటశేఖర కృష్ణ (Krishna) సైతం పయనించారు.ఈ ముగ్గురు పలు చిత్రాలకు దర్శకత్వం వహించి అలరించారు. 'హీరోస్ టర్డ్న్ డైరెక్టర్స్' లో యన్టీఆర్ సక్సెస్ రేట్ ఎవరికీ లేదనే చెప్పాలి. వీరి తరువాత కొందరు నటులు దర్శకులయినా, స్టార్స్ లో మళ్ళీ మెగాఫోన్ పట్టింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాత్రమే. 'జాని' సినిమాతో డైరెక్టర్ అయిన పవన్ ఆ మూవీ ఫ్లాప్ కావడంతో మళ్ళీ మెగా ఫోన్ పట్టింది లేదు. బాలకృష్ణ 'నర్తనశాల' పౌరాణిక చిత్రం రూపొందించే ప్రయత్నం చేశారు. కానీ, అది పూర్తి కాలేదు. రామ్ డైరెక్షన్ చేస్తే ఏ జానర్ ను ఎంచుకుంటారో అన్న ఆసక్తి ఫ్యాన్స్ లో నెలకొంది.


ఈ తరంలోనూ కొందరు హీరోలు దర్శకులుగా మారుతున్నారు. అడివి శేష్ (Adivi Shesh) ఆరంభంలోనే 'కర్మ, కిస్' అనే రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి. 'ఫలక్ నామా దాస్'తో డైరెక్టర్ అయిన విశ్వక్ సేన్, మొదటి ప్రయత్నంలోనే అలరించారు. తరువాత 'దాస్ కా ధమ్కీ' అనే చిత్రం రూపొందించారు. అది అంతగా మురిపించలేకపోయింది. ప్రస్తుతం 'కల్ట్' అనే మూవీ తెరకెక్కిస్తున్నారు విశ్వక్. రాహుల్ రవీంద్రన్ 'చి.ల.సౌ.' తో మెగా ఫోన్ పట్టారు- తరువాత 'మన్మథుడు-2', 'గర్ల్ ఫ్రెండ్' సినిమాలను రూపొందించారు. కొన్ని సినిమాల్లో హీరోగానూ నటించిన కమెడియన్ ధన్ రాజ్ 'రామం. రాఘవం' అనే మూవీకి దర్శకత్వం వహించారు. యంగ్ హీరో విశాల్ 'మకుటం' అనే చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నారు. ఆర్బీ చౌదరి నిర్మిస్తున్న 99వ చిత్రం 'మకుటం'. మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' అనే సినిమాతో డైరెక్టర్ కాబోతున్నారు. ఇలా ఈ తరం హీరోలు దర్శకులుగానూ మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరి రామ్ పోతినేని దర్శకునిగా తొలి ప్రయత్నంలో ఏ తీరున ఆకట్టుకుంటారో చూద్దాం.

Updated Date - May 12 , 2026 | 10:52 AM