RAPO23: పాండిచ్చేరిలో రామ్ పోతినేని ఏం చేస్తున్నారంటే..
ABN, Publish Date - Aug 04 , 2026 | 03:19 PM
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న RAPO23 టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న RAPO23 టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోంది. రామ్ కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిలవనున్న ఈ సినిమాపై అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అందమైన పాండిచ్చేరిలో శరవేగంగా సాగుతోంది. చిత్రబృందం అక్కడ 15 రోజుల పాటు షెడ్యూల్ ప్లాన్ చేసింది. దీనిలో సినిమాకు అత్యంత కీలకమైన సన్నివేశాలతో పాటు విజువల్‌గా ఆకట్టుకునే ఎపిసోడ్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఆమె రూపొందిస్తున్న స్టెప్పులు, విజువల్ ప్రెజెంటేషన్ ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. అంతేకాదు, సినిమాలోని హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను కూడా ఇదే షెడ్యూల్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్‌కు విక్రమ్ మోర్ మాస్టర్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. 'కేజీఎఫ్ ఛాప్టర్ 1', 'కాంతారా', 'కరుప్పు' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో తన స్టన్నింగ్ యాక్షన్‌తో గుర్తింపు పొందిన విక్రమ్ మోర్ ఈ సినిమాకూ అదే స్థాయి విజువల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్, అద్భుతమైన టెక్నికల్ టీమ్, గ్రాండ్ మేకింగ్‌తో రూపొందుతున్న #RAPO23 రామ్ పోతినేని కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.