RAPO 23: నియో-నోయర్ బ్యాక్‌డాప్‌లో ‘రాపో 23’
ABN, Publish Date - Jun 29 , 2026 | 01:56 PM
రామ్ పోతినేని హీరోగా ‘రాపో 23’ తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. ఈ చిత్రంతో రామ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు.
రామ్ పోతినేని హీరోగా ‘రాపో 23’ తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. ఈ చిత్రంతో రామ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. అనంతరం నిర్మాత కృష్ణ పోతినేని రామ్‌కు స్క్రిప్ట్ అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి పి.వి. రవికిషోర్ క్లాప్ కొట్టారు. పి.మురళీ మోహన్ కెమెరా స్విఛ్చాన్ చేయగా.. దర్శకుడిగా తన కొత్త ప్రయాణానికి శ్రీకారం చుడుతూ రామ్ పోతినేని స్వయంగా దర్శకత్వం వహించారు. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ శివార్లలో మొదలు కానుందని మేకర్స్ చెప్పారు.
నియో-నోయర్ బ్యాక్‌డాప్‌లో సాగే సైకలాజిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటి వరకు తెలుగు తెరపై చూడని విభిన్న అంశాలను, ఆసక్తికరమైన పాత్రల ప్రయాణంతో ఈ చిత్రం ఉండబోతోందని రామ్ తెలిపారు. హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించడం సవాల్‌తో కూడిన పని అని రామ్ పేర్కొన్నారు. ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం పలువురు ప్రముఖ నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఇతర వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ఈ సినిమాకు అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం పని చేస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత తిరునావుకరసు (తిరు) సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, పీటర్ హెయిన్స్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
‘హ్యాపీ జర్నీ’ టీజర్.. మగాళ్లకు తెలియాల్సిన మహిళల భావోద్వేగాలు!
పాతికేళ్ల తర్వాత... ఈ జన్మలోనే నాకు నచ్చిన పాత్ర చేశా- అన్నపూర్ణమ్మ
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్.. ఇక పట్టుకోలేరేమో