మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలపై వర్మ మార్క్ కామెంట్స్!
ABN , Publish Date - Mar 04 , 2026 | 05:39 PM
రాడనుకున్నారా.. రాలేడనుకున్నారా.. అదే సెటైర్.. అదే కాంట్రవర్సీ.. ఆర్జీవీ ఈజ్ బ్యాక్ అంటున్నారు అభిమానులు. అవునూ.. ఈ మధ్య కాస్త సైలెంట్‌గా ఉన్న వర్మ.. ఒకే ఒక్క కామెంట్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. ఇంతకి వర్మ ఏమన్నాడు!?ఎవరిని అన్నాడు!?
కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్నారు. సినిమాల గురించి, పాలిటిక్స్ గురించి తనదైన శైలిలో కామెంట్స్ చేయడం తగ్గించారు. ఇక ఆయన సైలెంట్‌గానే ఉంటారేమో అనుకుని డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్‌కు తాజాగా తనదైన శైలిలో కామెంట్స్ చేసి వర్మ ఈజ్ బ్యాక్ అని అనిపించుకున్నారు.
రామ్ గోపాల్ వర్మ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. అమెరికా - ఇరాన్ మధ్య జరుగుతున్న వారపై తనదైన సెటైరికల్ స్టైల్‌లో కామెంట్ చేశారు. దాన్ని సాధారణ రాజకీయ లేదా భౌగోళిక ఘర్షణగా చూడకుండా.. 'జీసస్ వర్సెస్ అల్లా' మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. ఆయన కామెంట్లపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. అంతేకాదు మరో ఆసక్తికర ముగింపును కూడా ఇచ్చారు వర్మ.
నాస్తికుడిగా పేరుపొందిన వర్మ ఈ యుద్ధంలో ఏ దేవుడు గెలిస్తే.. తాను ఆ మతంలోకి మారిపోతానని వ్యంగ్యంగా ప్రకటించారు. ఈ కామెంట్ షాకింగ్‌గా అనిపించినా, ఆయన మార్క్ హ్యూమర్‌తో ప్రపంచ సమస్యలను సరదాగా మలచడంలో ఆయన క్రియేటివిటి మళ్లీ కనిపించిందని అభిమానులు చెప్పుకుంటున్నారు. కొందరు దీన్ని స్మార్ట్ సెటైర్‌గా ప్రశంసిస్తుంటే, మరికొందరు అలా మాట్లాడటం సరికాదని హితవు పలుకుతున్నారు. మిడిల్ ఈస్ట్‌లో యుద్థం కారణంగా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటే వర్మ ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణమని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏదేమైనా వర్మ ట్వీట్ వైరల్ అవుతూ ఆయన్ని మళ్లీ వార్తల్లోకి తీసుకొచ్చింది.
Read Also: అప్పుడు 'అఖండ 2'... ఇప్పుడు 'టాక్సిక్'... 'ధురంధర్'కు బలే కలిసొచ్చిందిగా!
Read Also: ఇదెక్కడి కాంబినేషన్ రా మావా.. బాలయ్యకు విలన్‌గా మంచు వారసుడు