ఇదెక్కడి కాంబినేషన్ రా మావా.. బాలయ్యకు విలన్‌గా మంచు వారసుడు!

ABN , Publish Date - Mar 04 , 2026 | 03:04 PM

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది.

NBK 111

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. దీంతో ఈ కాంబోపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎన్.బి.కె.111 గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రసుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

అందుతున్న సమాచారం ప్రకారం ఎన్.బి.కె.111 లో నందమూరి బాలకృష్ణకు విలన్‌గా మంచు వారసుడు మంచు మనోజ్ కనిపించనున్నారని టాక్. భైరవం సినిమాతో మనోజ్ రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేక పోయినా.. ఆ తరువాత వచ్చిన మిరాయ్ మనోజ్ కి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చింది. దీని తరువాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం ఒక పక్క హీరోగా.. ఇంకోపక్క విలన్ గా నటిస్తూ బిజీగా మారారు. మొన్నటివరకు చిరంజీవి - బాబీ సినిమాలో కూడా మనోజ్ విలన్ గా నటిస్తున్నారు అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమా కొద్దిగా వెనక్కి వెళ్ళడంతో బాలయ్య-గోపీచంద్ మలినేని సినిమా ఛాన్స్ వచ్చిందని సమాచారం.

మంచు మనోజ్ సినిమా 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా'లో బాలకృష్ణ అతిథి పాత్రను పోషించారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఆ తరువాత ఈ కాంబో మళ్ళీ రిపీట్ కాలేదు. గోపీచంద్ మలినేని ఈ సినిమాలో బాలయ్యను సింగిల్ గానే చూపిస్తూ ఒక డిఫరెంట్ కథను తెరకెక్కించ నున్నారట. ఇందులో ఒక అద్భుతమైన రోల్ కోసం మంచు మనోజ్ ని సంప్రదించగా.. ఆయన వెంటనే ఓకే అన్నారని సమాచారం. దీంతో కచ్చితంగా మనోజ్ ది విలన్ రోల్ అని, బాలయ్య పాత్రకు దీటుగా ఆ క్యారెక్టర్ ఉండబోతుందని నెటిజన్స్ చెప్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Mar 04 , 2026 | 03:56 PM