సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

RGV: వ‌ర్మ.. మ‌ళ్లీ దిగాడుగా! ప్రకాశ్ రాజ్‌కు స‌పోర్ట్‌గా.. నాగబాబు ట్వీట్‌పై సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Jun 08 , 2026 | 08:24 PM

కొంత‌కాలంగా మీడియాకు, సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్న డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ (Ram Gopal Varma) స‌డ‌న్‌గా ఫీల్డ్‌లోకి దిగాడు.

prakash raj

కొంత‌కాలంగా మీడియాకు, సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్న డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ (Ram Gopal Varma) స‌డ‌న్‌గా ఫీల్డ్‌లోకి దిగాడు. త‌న‌దైన శైలిలో ట్వీట్‌తో పోస్టు పెట్టి మ‌రోసారి వార్త‌ల‌లోకి వ‌చ్చేశాడు. ఎమ్మెల్సీ నాగ‌బాబు (Nagendra Babu) ఇటీవ‌ల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫోటోను షేర్ చేస్తూ “నాయకుడి మాటే శిరోధార్యం. ఆయన చూపిన మార్గంలోనే నడవాలి. సందేహాలను పక్కనపెట్టి, ప్రశ్నలు వేయకుండా నాయకుడినే అనుసరించాలి” అంటూ చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో, రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే నాగ‌బాబు పోస్టుకు కౌంట‌ర్‌గా ప్ర‌కాశ్ రాజ్ (Prakash Raj) స్పందిస్తూ.. “మేము గొర్రెలం కాదు, ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి హక్కు. ఏ నాయకుడైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది” అంటూ ట్వీట్‌ చేశారు. ఈ పోస్టుపై అనేక‌మంది నెటిజ‌న్లు రెస్పాండ్ అవుతూ కామెంట్లు చేశారు. ఈ కోవ‌లోనే ఆర్జీవీ సైతం రియాక్ట్ అయ్యారు. “ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరిస్తాడనే నమ్మకంతో ఒక నాయకుడికి బాధ్యతాయుతమైన పదవిని ఇస్తారు. కానీ అతనికి రాజుగా పట్టాభిషేకం చేయరు” అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే.. ఇన్నాళ్లుగా ఎలాంటి చ‌ప్పుడు లేకుండా ముంబైకి షిఫ్ట్ అయిన ఆర్జీవీ ఇప్పుడు ఇలా స‌డ‌న్‌గా ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డంపై స‌ర్వ‌త్రా కొత్త చ‌ర్చ మొద‌లైంది. ఆర్జీవీ మ‌ళ్లీ రంగంలోకి దిగిన‌ట్లేనా ఇక‌పై మ‌ళ్లీ ట్వీట్ల‌తో దండ‌యాత్ర ఏస్తాడా లేక త‌న రాబోతున్న పోలీస్ స్టేష‌న్ మే బూత్ సినిమా ప్ర‌మోష‌న్ కోసం మ‌ర‌లా యాక్టీవ్ అవుతున్నాడా అని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - Jun 08 , 2026 | 08:24 PM