సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ramcharan 17: ఆర్‌సీ 17 సెట్స్‌ మీదకు వెళ్లేది ఎప్పటి నుంచంటే..

ABN, Publish Date - May 05 , 2026 | 09:35 AM

పెద్ది సినిమా జూన్‌ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క వాట్‌ నెక్ట్స్‌ రామ్‌చరణ్‌ అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి.


గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘పెద్ది’ చిత్రంతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే! రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం విడుదల తేదీలో క్లారిటీ వచ్చింది. ఇటీవల మేకర్స్‌ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. జూన్‌ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క వాట్‌ నెక్ట్స్‌ రామ్‌చరణ్‌ అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి.
తదుపరి చిత్రం ఆయన సుకుమార్‌ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఇది గతంలో కమిట్‌ అయిందే!

ఆర్‌సీ17 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాకు కూడా ఓ బలమైన కథను తయారు చేస్తున్నారట సుక్కూ. ఇప్పటికే లెక్కల మాస్టర్‌ స్ర్కిప్ట్‌ పనులు ఓ కొలిక్కి తెచ్చారని, తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారని చిత్ర వర్గాల నుంచి సమాచారం అందింది. అయితే ఈ సినిమాకు సంబంధించి సోమవారం నుంచి ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఈ చిత్రాన్ని జులైలో సెట్స్‌ మీదకు తీసుకెళ్లనున్నారని తెలిసింది. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన చెర్రీ వెల్లడించారు. ‘రంగస్థలం’లాంటి భారీ విజయం తర్వాత సుకుమార్‌, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై కూడా భారీ అంచనాలున్నాయి. 

Updated Date - May 05 , 2026 | 10:23 AM