సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Peddi-Ravi Kishan: ‘పెద్ది’లో కొన్ని సన్నివేశాలు చూస్తే.. కళ్లలో నీళ్లు తిరిగాయి..

ABN, Publish Date - May 24 , 2026 | 04:12 PM

‘మట్టిలో నుంచి ఎదిగి, తన కలలను నిజం చేసుకోవాలని పోరాడే ఓ యువకుడి కథ ఇది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ రూపంలో మీరు ఒక గొప్ప నాయకుడిని చూస్తారు


‘మట్టిలో నుంచి ఎదిగి, తన కలలను నిజం చేసుకోవాలని పోరాడే ఓ యువకుడి కథ ఇది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ రూపంలో మీరు ఒక గొప్ప నాయకుడిని చూస్తారు. ఆ పాత్ర ప్రేక్షకులకు ఆశను, స్ఫూర్తిని ఇస్తుంది’ అని బీజేపీ ఎంపీ, నటుడు రవికిషన్‌ అన్నారు. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన చిత్రం ‘పెద్ది’. వెంకట సతీశ్‌ కిలారు నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా మధ్యప్రదేవ్‌ భోపాల్‌లో శనివారం భారీ మ్యూజికల్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన నటుడు రవికిషన్‌ మాట్లాడుతూ ‘ఏఆర్‌ రెహమాన్‌ గారు వంటి లెజెండ్‌ సమక్షంలో ఈ వేడుక జరగడం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి. రామ్‌చరణ్‌ ఈ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచారు. జాన్వీ కపూర్‌ కూడా ఎంతో చక్కగా తన పాత్రను పోషించింది. మట్టిలో నుంచి ఎదిగి తన కలలను నిజం చేసుకోవాలని పోరాడే ఓ యువకుడి కథ ఇది. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ రూపంలో మీరు ఒక గొప్ప నాయకుడిని చూస్తారు. ఈి సనిమాకు డబ్బింగ్‌ చెబుతున్న సమయంలో కొన్ని సన్నివేశాలు చూసిన నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ సినిమాతో రామ్‌ చరణ్‌కి నేషనల్‌ అవార్డు పక్కాగా వస్తుంది. దేశంలోని ప్రతి యువకుడు ఈ కథతో కచ్చితంగా కనెక్ట్‌ అవుతాడు. ‘పెద్ది’ భారతదేశ యువతకు ఒక కొత్త హోప్‌ని ఇచ్చే సినిమా అవుతుంది. బుచ్చిబాబు ఈ చిత్రాన్ని చక్కగా తీర్చిదిద్దారు. నేను ఎన్నో సినిమాలు చూశాను, ఎన్నో చిత్రాల్లో నటించాను. కానీ ‘పెద్ది’ మాత్రం ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని తాకే సినిమా అని బలంగా నమ్ముతున్నా’ అని అన్నారు.

క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి శ్రీ విశ్వాస్‌ సారంగ్‌ మాట్లాడుతూ ‘
భోపాల్‌ ప్రజలు కళాకారులను ఎంతో ప్రేమిస్తారు. ‘పెద్ది’ చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వేడుకను భోపాల్‌లో ఇంత గ్రాండ్‌గా నిర్వహించినందుకు రామ్‌ చరణ్‌ గారికి అభినందనలు. భవిష్యత్తులో భోపాల్‌ షూటింగ్‌లు కూడా నిర్వహించాలని కోరుకుంటున్నా.  ప్రభుత్వం తరుపున మా సాయం అందిస్తాం’ అని అన్నారు.        



Updated Date - May 24 , 2026 | 04:18 PM