సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అయ్యప్ప ఆలయంలో రామ్ చరణ్ - ఉపాసన..

ABN, Publish Date - Jul 29 , 2026 | 06:44 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఆయన సతీమణి ఉపాసన కొణిదెల( Upasana) బుధవారం తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ప్రముఖ అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.

Ram Charan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఆయన సతీమణి ఉపాసన కొణిదెల( Upasana) బుధవారం తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ప్రముఖ అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న ఈ జంట ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో రామ్ చరణ్, ఉపాసనలకు పూజారులు ప్రత్యేక ఆశీర్వచనాలతో పాటు తీర్థప్రసాదాలను అందించారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఆధ్యాత్మిక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


ఇటీవల కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్ లో రామ్ చరణ్‌కు మణికట్టు శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. సర్జరీ విజయవంతంగా పూర్తి కావడంతో, తన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన సందర్భంగా స్వామివారికి కృతజ్ఞతలు తెలిపేందుకే చరణ్ దంపతులు ఈ ఆలయ సందర్శన చేసుకున్నట్లు తెలుస్తోంది. చేతికి సర్జరీ జరిగినప్పటికీ, ఆయన ఎంతో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామివారి సేవలో పాల్గొనడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.


కొన్నిరోజుల రెస్ట్ తరువాత చరణ్ తన కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టనున్నాడు.పెద్ది తరువాత సుకుమార్ దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వీరి కలయికలో రాబోతున్న చిత్రం కావడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక గ్లోబల్ స్టార్ త్వరగా కోలుకుని, మళ్లీ పూర్తి ఫిట్‌నెస్‌తో షూటింగ్ సెట్స్‌లోకి అడుగుపెట్టాలని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - Jul 29 , 2026 | 06:44 PM