సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పెద్ది ప్రమోషన్స్.. ఆపరేషన్ వాయిదా

ABN, Publish Date - May 31 , 2026 | 02:18 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఒక సినిమా కోసం ఎంత కష్టపడతాడో అందరికీ తెల్సిందే. పెద్ది(Peddi) సినిమా విషయంలో మరింత ఎక్కువగా కష్టపడినట్లు తెలుస్తోంది.

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఒక సినిమా కోసం ఎంత కష్టపడతాడో అందరికీ తెల్సిందే. పెద్ది(Peddi) సినిమా విషయంలో మరింత ఎక్కువగా కష్టపడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆయన ఎన్నో దెబ్బలను కూడా ఓర్చుకున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది జూన్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పెద్ది నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా మెప్పించడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేశాయి.


ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన రామ్ చరణ్.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాడు. పెద్ది షూటింగ్ సమయంలో చరణ్ మణికట్టుకు గాయం అయిన విషయం తెల్సిందే. రియల్ రెజ్లర్స్ తో ఫైట్ చేయడంతో చరణ్ చేతికి గాయమయ్యింది. వెంటనే డాక్టర్ చేతికి సర్జరీ చేయాలని చెప్పినట్లు సమాచారం. ఇక ఈ మధ్యనే చరణ్ చేతికి సర్జరీ చేయించుకుంటున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఇంకా చరణ్ చేతికి కట్టు ఉంది. దీంతో ఆయన సర్జరీ చేయించుకోలేదని తెలుస్తోంది.


తాజాగా చరణ్ ఒక ఇంటర్వ్యూలో తన చేతికి ఇంకా సర్జరీ చేయలేదని కన్ఫర్మ్ చేశాడు. పెద్ది రిలీజ్ అయ్యాకే తాను సర్జరీ చేయించుకుంటానని, ప్రమోషన్స్ ఎక్కువ ఉండడం వలన సర్జరీని వాయిదా వేసినట్లు తెలిపాడు. ఈ విషయం తెలియడంతో మెగా ఫ్యాన్స్ నొప్పి భరిస్తూనే సినిమా ప్రమోషన్స్ కి తిరుగుతున్నాడు.. సినిమా కోసం ఏదైనా చేస్తాడు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - May 31 , 2026 | 02:34 PM