RC17: అఫీషీయల్.. ఆర్సీ17 పూజ అప్పుడే
ABN, Publish Date - Oct 31 , 2026 | 08:57 PM
ఎన్నాళ్ళో వచ్చిన ఉదయం.. రేపే ఎదురవుతుంది అని మెగా ఫ్యాన్స్ పాటలు మొదలుపెట్టారు. పెద్ది తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సుకుమార్ తో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా పట్టాలెక్కుతుంది అని ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఎదురు చూశారో అందరికీ తెలుసు.
ఎన్నాళ్ళో వచ్చిన ఉదయం.. రేపే ఎదురవుతుంది అని మెగా ఫ్యాన్స్ పాటలు మొదలుపెట్టారు. పెద్ది తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సుకుమార్ తో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా పట్టాలెక్కుతుంది అని ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఎదురు చూశారో అందరికీ తెలుసు. ఈలోపే పెద్ది సమయంలో అయిన గాయానికి చరణ్ సర్జరీ చేయించుకొని బెడ్ రెస్ట్ లోకి వెళ్ళిపోయాడు. ఇక ఆ తరువాత RC17 గురించి ఏ వార్త వచ్చినా అది ఇట్టే వైరల్ గా మారడం మొదలయ్యింది. RC17 పూజ అప్పుడు.. ఇప్పుడు అంటూ న్యూస్ వచ్చింది. దసరా పండగ అని కొన్నిరోజులు.. లేదు పండగ తరువాత అని ఇంకొన్నిరోజులు మాట్లాడుకున్నారు.
ఇక RC17 కోసం ఏర్పాటు చేసిన ఆఫీస్ పూజ రోజున జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆరోజే సినిమా పూజ అని సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు హోరెత్తిపోయాయి. ఆ తరువాత పూజని వదిలేసి హీరోయిన్ గురించి హంగామా జరిగింది. బాలీవుడ్ బ్యూటీస్, అచ్చ తెలుగు అందం అంటూ హీరోయిన్ల పేర్లు సోషల్ మీడియాని షేక్ చేశాయి. చివరికి తెలుగు అందం సాత్విక వీరవల్లి కూడా హీరోయిన్ కాదని టాక్ నడుస్తోంది. అసలు ఇవన్నీ కాదు.. అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న తరుణంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమయ్యేందుకు ముహూర్తం ఖరారైందని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.
మొదట నుంచి అనుకుంటున్నట్లే నవంబర్ 1న అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా తెలిపింది. ఈ పూజా కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. సుకుమార్ తన మార్క్ ఎమోషన్స్, గ్రిప్పింగ్ కథనంతో రామ్ చరణ్‌ను సరికొత్త లూప్‌లో, పవర్ఫుల్ అవతార్‌లో చూపించబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గ్రాండ్ లాంచ్ తర్వాత త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. మరి రేపు హీరోయిన్ ఎవరు అనేది రివీల్ చేస్తారేమో చూడాలి.