సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

RC 17: రామ్ చరణ్‌ జోడీగా.. విక్ర‌మ్ కూతురు

ABN, Publish Date - Oct 13 , 2026 | 08:50 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కక ముందే కొన్ని విశేషాలకు వేదిక అయింది. దాంతో మరింత ఆసక్తి పెరిగింది. ఇందులో హీరోయిన్ పైనా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఆ ముచ్చటేంటో మరి.!?

ramcharan sara arjun

రామ్ చరణ్ (ram charan), సుకుమార్ (sukumar) కాంబోలో తెరకెక్కే మూవీ దసరాకు ఆరంభమవుతుందని సమాచారం. గతంలో వీరిద్దరి కలయికలో రూపొందిన 'రంగస్థలం' బిగ్ హిట్‌గా నిలచింది. దాంతో చెర్రీ-సుక్కు కొత్త ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు సహజమే. అయితే అంతకు మించి అభిమానుల్లో అంచనాలు అధికం కావడానికి మరో బలమైన కారణం ఉంది. మెగా కాంపౌండ్ కే చెందిన అల్లు అర్జున్‌తో సుకుమార్ 'పుష్ప' రెండు భాగాలతో బంపర్ హిట్స్ చూశారు. ఆ రెండు సినిమాలలాగే చెర్రీతో సుక్కు తెరకెక్కించబోయే మూవీ కూడా బిగ్ హిట్ కావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్‌ జోడీగా 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ (Sara Arjun) ను ఎంపిక చేసినట్టు విశేషంగా వినిపిస్తోంది. దాంతో మరింత ఇంట్రెస్ట్ కలుగుతోంది.

బాలనటిగానూ భళా..

సారా అర్జున్ ఒకప్పుడు బాలనటిగా అలరించింది. విక్రమ్ హీరోగా రూపొందిన 'దైవ తిరుమగల్' సినిమాలో ఆయన కూతురుగా నటించి సారా అర్జున్ భలేగా ఆకట్టుకుంది. ఆ చిత్రం తెలుగులో 'నాన్న' పేరుతో అనువాదమైంది. దాంతో తెలుగువారినీ సారా అభినయం ఆకర్షించింది. నాన్న సినిమాతో త‌న‌కంటూ ప్ర‌త్యేక ఫ్యాన్ బేస్ సృష్టించుకున్న సారా ఆపై రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో రూపొందిన 'దాగుడుమూత దండాకోర్'లోనూ చిన్నారి సారా అర్జున్ తనదైన నటనతో మురిపించింది. 'ధురంధర్' చిత్రంలో రణవీర్ సింగ్ సరసన నాయికగా నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ స్టేట‌స్ సొంతం చేసుకుని బాలీవుడ్‌లో బిజీ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతుంది దాంతో గుణశేఖర్ తన 'యుఫోరియా'లో చైత్ర పాత్రలో సారాను నటింప చేశారు. ఈ మూవీలోనూ నటిగా మంచి మార్కులు సంపాదించింది సారా. ఇలా తెలుగువారికి ఇంతకు ముందే పరిచయమైన సారా అర్జున్ ఇప్పుడు రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సరసన జోడీగా నటించడం విశేషంగా మారింది.

మొదలు కాకముందే..

రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కబోయే రెండో సినిమాలో సారా అర్జున్ హీరోయిన్ అవ్వడం ఓ విశేషమైతే, ఈ చిత్రంతో తొలిసారి సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ బాణీలను వీడడం మరో సంగతి. ఇప్పటి దాకా దేవిశ్రీ స్వరాలతోనే సాగిన సుకుమార్ మొదటిసారి అనిరుధ్ రవిచందర్ ను ఈ ప్రాజెక్ట్ కోసం సంగీత దర్శకునిగా ఎన్నుకున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ కు ప్రతినాయకునిగా నటించేది ఎవరు అన్న అంశంపైనా చర్చ సాగుతోంది.

ఒకప్పుడు యాంగ్రీ మేన్‌గా జనాన్ని ఆకట్టుకున్న డాక్టర్ రాజశేఖర్ పేరును ఈ సినిమాలో ప్రతినాయకుని పాత్ర కోసం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'ఆరాధన' చిత్రంలో రాజశేఖర్ కీ రోల్ పోషించారు. ఇప్పుడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సినిమాలోనూ నటించడానికి రాజశేఖర్ ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఇలా ప్రాజెక్ట్ పట్టాలెక్కక ముందు నుంచే రామ్ చరణ్ - సుకుమార్ కొత్త సినిమా ముచ్చట్లు వినిపిస్తున్నాయి. మరి ఆరంభమైన తరువాత ఇంకెన్ని విశేషాలు వినిపిస్తాయో చూద్దాం.

Updated Date - Oct 13 , 2026 | 08:50 PM