సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రామ్ చరణ్‌ ఫ్యాన్స్‌కు ఇది నిరాశే..

ABN, Publish Date - Jun 13 , 2026 | 01:09 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న ఆర్‌సి17 చిత్రంపై ఇప్పుడో వార్త వైరల్ అవుతోంది.

RC17 Update

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), క్రియేటివ్ జీనియస్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎలాంటి సంచలనాలు సృష్టించిందో మనందరికీ గుర్తే. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించడమే కాకుండా, రామ్ చరణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కేలా చేసింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుండటంతో యావత్ సినీ ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం దర్శకుడు సుకుమార్ ఇప్పటికే కథా చర్చలు, ప్రీ-ప్రొడక్షన్ పనులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.


ప్రస్తుతం రామ్ చరణ్ తన లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ సాధించిన భారీ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో చరణ్ నటనకు, మేకర్స్ పడిన కష్టానికి థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పటికే పెద్ది బాక్సాఫీస్ వద్ద రూ.345 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో తీవ్రంగా శ్రమించిన మెగా పవర్ స్టార్, ఇప్పుడు కొద్దిరోజుల పాటు షూటింగ్‌లకు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఫిలిం నగర్ టాక్. ‘పెద్ది’ సినిమా యాక్షన్, స్పోర్ట్స్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్‌కు కొన్ని చిన్న గాయాలైనట్లు సమాచారం. ఈ గాయాల ఉపశమనం కోసం ఆయనకు ఒక చిన్న సర్జరీ జరగాల్సి ఉందని, ఆ తర్వాత వైద్యుల సలహా మేరకు కొన్ని నెలల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోనున్నారని తెలుస్తోంది. చరణ్ కోలుకోవడానికి సమయం పట్టనుండటంతో, సుకుమార్ దర్శకత్వంలో ప్రారంభం కావాల్సిన RC17 సినిమా షూటింగ్ ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ జనవరి 2027లో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉందట.


షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యం అవుతుండటాన్ని బట్టి చూస్తే, రామ్ చరణ్ తదుపరి చిత్రం 2027 ప్రారంభమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. అంటే వచ్చే ఏడాది చరణ్ సినిమా వెండితెరపై రావడం కాస్త కష్టమేననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే మాత్రం రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదనే చెప్పుకోవాలి. అయితే ఈ సర్జరీ, షూటింగ్ వాయిదాపై అటు సుకుమార్ టీమ్ నుంచి కానీ, ఇటు మెగా క్యాంప్ నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. ‘రంగస్థలం’లో చిట్టిబాబుగా మెప్పించిన చరణ్‌ను, ఈసారి సుకుమార్ ఎలాంటి ఊరమాస్ పాత్రలో చూపిస్తారా అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఆ రోజు బాలయ్య ఆశీర్వదించినట్లే జరగడంతో.. ఆనందంలో నారా బ్రహ్మణి!

ఎన్టీఆర్ లైనప్‌లో ఊహించని ట్విస్ట్.. నెల్సన్ సినిమా లేనట్టేనా

నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష: చిరంజీవి కుమార్తె శ్రీజ

Updated Date - Jun 13 , 2026 | 01:09 AM