సుకుమార్ రేంజ్‌లో.. పెద్ది స్పెషల్ సాంగ్!
ABN, Publish Date - Apr 21 , 2026 | 05:48 PM
పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఆ లక్కీ బ్యూటీ ఎవరా అని..! ఈ ఒక్క పాట కోసం మేకర్స్ పడ్డ తర్జనభర్జనలు అన్నీ ఇన్నీ కావు.
టాలీవుడ్ యాక్షన్ డ్రామా పెద్ది (Peddi) సినిమాపై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే పెద్ది షాట్, పెహిల్వాన్ టీజర్, సాంగ్స్‌తో ప్రకంపనలు సృష్టించిన ఈ సినిమా, ఇప్పుడు ఒక హాట్ అప్‌డేట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఒకటే చర్చ.. పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఆ లక్కీ బ్యూటీ ఎవరా అని..!
ఈ ఒక్క పాట కోసం మేకర్స్ పడ్డ తర్జనభర్జనలు అన్నీ ఇన్నీ కావు. ముందుగా సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) పేరు వినిపించింది. ఆ తర్వాత బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) రాబోతోందని టాక్ నడిచింది. ఆ తరువాత బాలీవుడ్ బ్యూటీ అయేషా ఖాన్ (Ayesha Khan), అందాల సుందరి మానస వారణాసి (Manasa Varanasi) పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి. ప్రతి ఒక్కరికీ సుపరిచితమైన ఈ స్టార్ హీరోయిన్లందరినీ కాదని, మేకర్స్ ఇప్పుడు ఒక సెన్సేషనల్ ఛాయిస్‌ను ఎంచుకున్నారు.
గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ (Samyuktha) ఇప్పుడు పెద్ది స్పెషల్ సాంగ్‌లో తన గ్లామర్ పవర్ చూపించడానికి సిద్ధమైపోయింది. విరూపాక్ష, బింబిసార వంటి సినిమాలతో మెప్పించిన ఈ మలయాళ బ్యూటీ, మొదటిసారి ఇలాంటి పక్కా మాస్ నంబర్‌లో కనిపించబోతుండటం విశేషం. ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చి నుంచి ఏప్రిల్‌కు, అక్కడి నుంచి జూన్‌కు మారుతూ వస్తున్నా, అవుట్‌పుట్ విషయంలో దర్శకుడు ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.
సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. కేవలం ఈ స్పెషల్ సాంగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ పాట కోసం హైదరాబాద్‌లో ఒక భారీ సెట్‌ను డిజైన్ చేశారట. కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ సెట్‌లో, సంయుక్త మీనన్ తన స్టెప్పులతో రచ్చ చేయబోతోంది. ఈ వారంలోనే ఈ పాట సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఆ వెంటనే ప్రమోషన్ల మీద ఫోకస్ పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
దర్శకుడు బుచ్చిబాబు సన.. లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యుడన్న సంగతి మనకు తెలిసిందే. సుకుమార్ సినిమాల్లో ‘ఊ అంటావా మావా’ లేదా ‘రింగ రింగ’ వంటి పాటలు ఏ రేంజ్ లో హిట్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు తన గురువు బాటలోనే బుచ్చిబాబు సన కూడా ఈ పాటను సినిమాకే హైలైట్‌గా ప్లాన్ చేశారు.
ఈ పాట థియేటర్లలో ప్రేక్షకులను సీట్ల నుంచి లేచి డాన్స్ చేసేలా చేస్తుందని, అలాగే సినిమా కథలో ఈ పాట చాలా కీలకం కాబోతోందని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంయుక్త మీనన్ గ్లామర్ పెద్ది సినిమాకు మరో బూస్టప్‌గా మారనుంది. మరి ఈ మలయాళ బ్యూటీ తన మాస్ యాంగిల్‌తో టాలీవుడ్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి!