అప్పుడు ఎన్టీఆర్... ఇప్పుడు చరణ్! రైమ్‌తో.. రేర్ ఫ్రేమ్
ABN, Publish Date - Apr 14 , 2026 | 04:35 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో అరుదైన గుర్తింపును పొందారు. గ్లోబల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ఛాన్స్ కొట్టేశారు. వరల్డ్ వైడ్‌గా అందరూ మాట్లాడుకునేలా చేసుకున్నారు. ఇంతకీ చరణ్‌కు దక్కిన ఆ అవకాశంమేంటి!?
సినిమా ప్రపంచంలో కొన్ని క్షణాలు... కేవలం ఫోటోలుగా మిగలవు… అవి ఒక స్టేట్‌మెంట్‌గా మారతాయి. అలాంటి గ్లోబల్ స్టేట్‌మెంట్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. 'ఎస్క్వైర్ ఇండియా' మ్యాగజైన్ ఏప్రిల్ ఎడిషన్ కవర్‌పై తన స్టైలిష్ లుక్‌తో అదరగొట్టారు. 'పెద్ది' సినిమా కోసం మార్చుకున్న రగ్గడ్ హెయిర్‌స్టైల్, సీరియస్ అటిట్యూడ్‌తో ఆ ఫోటోస్‌లో చెర్రీ కనిపించారు. ఈ షూట్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు రాగా.. అవి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.
దుబాయ్‌లో జరిగిన స్పెషల్ ఫోటో షూట్‌లో రామ్ చరణ్ స్టైలిష్ స్టిల్స్‌కు ఫోజ్ ఇచ్చారు. ఆ ఫోటోల్లో చరణ్‌తో పాటు ఆయనకు ఇష్టమైన పెట్ డాగ్ 'రైమ్' కూడా ఫ్రేమ్‌లోకి వచ్చింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యాయి. అభిమానులు లైకులు, కామెంట్లు, షేర్లతో సందడి చేస్తున్నారు. మరోవైపు ఎస్క్వైర్ సంస్థ రామ్ చరణ్ పై ప్రశంసల జల్లు కురిపించింది. గ్లోబల్ ఫోర్స్‌గా ఎదుగుతున్న చరణ్ నేటి ఇండియన్ సినిమాకు ఒక నిర్వచనమని అభివర్ణించింది. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్‌కు పెరిగిన గ్లోబల్ ఇమేజ్‌కు ఈ కవర్ పేజీ మరో నిదర్శనమంటున్నారు ఫ్యాన్స్.
ఇదిలా ఉంటే ఎస్క్వైర్ పై ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా మెరిశారు. 2025 ఆగస్టు ఎడిషన్‌లో ఎన్టీఆర్ ఎస్క్వైర్ ఇండియా కవర్‌పై చోటు సంపాదించుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ రెండో హీరోగా ఈ గౌరవం అందుకున్నారు. 'ట్రిపుల్ ఆర్' హీరోలిద్దరూ ఈ పాపులర్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కవర్‌పై కనిపించడం అభిమానులకు డబుల్ ట్రీట్ అనే చెప్పాలి.
Read Also: తమిళ దర్శకుడిపై తెలుగు నిర్మాత ఫిర్యాదు!
Read Also: హీరో రామ్ పోతినేని.. ఇంకా బ్యాచ్‌లర్‌గా ఉండటానికి కారణం ఇదేనా?