రామ్‌చరణ్: సర్జరీ జరిగినా... రెస్ట్ తీసుకోకపోవడానికి బలమైన కారణమదే!
ABN, Publish Date - Mar 30 , 2026 | 08:12 PM
ఇటీవల రామ్‌చరణ్ కంటికి గాయమై సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే! పూర్తిగా రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా తర్వాతి రోజే సెట్‌లో అడుగుపెట్టి షూటింగ్ చేశారు రామ్‌చరణ్.
ఇటీవల రామ్‌చరణ్ (Ram charan) కంటికి గాయమై సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే! పూర్తిగా రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా తర్వాతి రోజే సెట్‌లో అడుగుపెట్టి షూటింగ్ చేశారు రామ్‌చరణ్. ఈ విషయాన్ని మేకర్సే స్వయంగా వెల్లడించారు. గాయంతో ఇబ్బంది పడుతూ.. కనీసం కొన్ని గంటలకు కూడా గ్యాప్ తీసుకోకుండా సెట్‌లో అడుగుపెట్టడానికి బలమైన కారణమే ఉందట.
ఆరోజు షూటింగ్ గచ్చిబౌలి స్టేడియంలో..
దాదాపు 1300 మంది క్రూ..
సినిమాకు కీలకమైన సన్నివేశం చిత్రీకరణ...
అదే సమయంలో అక్కడే రామ్‌చరణ్‌కు గాయమైంది.
తర్వాతి రోజు కూడా అదే టీమ్‌తో షెడ్యూల్ ఉంది. రామ్‌చరణ్ ఆ ఒక్కరోజు సెలవు పెడితే 1300 ఆర్టిస్ట్‌లు, ఇతర సాంకేతిక నిపుణుల సమయం, కాల్షీట్ వృధా అవుతుందనే ఉద్దేశంతో రామ్‌చరణ్ సర్జరీ పూర్తయ్యాక ఉదయాన్నే సెట్‌లో అడుగుపెట్టారు. దీంతో వృత్తి పట్ల ఆయనకు ఉన్న నిబద్దతను చాటుకున్నట్లు అయింది.
ప్రస్తుతం ఈ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్ 30న సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకుడు బుచ్చిబాబు సానా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, గ్లింప్స్ సినిమాకు రెట్టింపై క్రేజ్ తీసుకొచ్చాయి. రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పహిల్వాన్ లుక్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. ఇందులో చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.
మళ్లీ వాయిదా పడే అవకాశం..
అయితే తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న కూడా సినిమా విడుదల అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, సిజి వర్క్ పెండింగ్ ఉండటంతో సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. జూన్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.