రామ్ చరణ్ కోలుకున్నారు.. ఎలాంటి ఇబ్బంది లేదు..
ABN, Publish Date - Mar 26 , 2026 | 08:34 AM
‘పెద్ది’ (Peddi) సినిమా సెట్స్‌లో రామ్‌చరణ్ (Ram Charan) గాయపడిన సంగతి తెలిసిందే. దీనిపై చిత్ర బృందం స్పందించింది
‘పెద్ది’ (Peddi) సినిమా సెట్స్‌లో రామ్‌చరణ్ (Ram Charan) గాయపడిన సంగతి తెలిసిందే. దీనిపై చిత్ర బృందం స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన ఎడమ కంటి పక్కన చిన్న గాయమైందని, వెంటనే చికిత్స జరిగిందని, ప్రస్తుతం రామ్ చరణ్ కోలుకున్నారని మేకర్స్ తెలిపారు. గురువారం నుంచి ఆయన సెట్లో ఉంటారని, షూటింగ్ షెడ్యూల్ కి ఎలాంటి ఇబ్బంది లేదని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్స్ నమ్మొద్దని ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ నెల 27న రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ టీమ్ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతోంది. శుక్రవారం ఉదయం 11.07 గంటలకు స్పెషల్ వీడియోను విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలోజాన్వీ కపూర్ కథానాయిక.