సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఇక.. ఆరు రోజులే! చివరి దశకు పెద్ది

ABN, Publish Date - Apr 22 , 2026 | 06:46 AM

చాలాకాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు శుభవార్త చెప్పారు దర్శకుడు బుచ్చిబాబు

Peddi

చాలాకాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు శుభవార్త చెప్పారు దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana). రామ్‌చరణ్ (Ram Charan) కథానాయకుడిగా ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రం ‘పెద్ది’ (Peddi) షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఇంకో ఆరు రోజుల్లో షూటింగ్‌ పూర్తవనుంది. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా వెల్లడించారు.

రామ్‌చరణ్‌తో సెట్‌లో దిగిన సెల్ఫీని సోషల్‌ మీడియా వేదికగా ఆయన పంచుకున్నారు. సెట్‌లో చివరి ఆరు రోజులు అని కామెంట్‌ పెట్టారు. ‘నాకు అత్యంత స్ఫూర్తినిచ్చిన పాత్ర..నేను ప్రేమించే పెద్ది’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. కాగా, ఈ సినిమాను జూన్‌లో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నద్దమవుతోంది. ఇందులో భాగంగా షూటింగ్‌తో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా సమాంతరంగా సాగుతున్నాయి.

Updated Date - Apr 22 , 2026 | 06:46 AM