సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆదిపురుష్ డైరెక్టర్ తో రామ్ చరణ్.. జోక్ చేస్తున్నారా

ABN, Publish Date - Sep 16 , 2026 | 11:01 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల పెద్ది సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రాన్ని దిగ్గజ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఇటీవల పెద్ది సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రాన్ని దిగ్గజ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, ఈ ప్రాజెక్ట్‌తో పాటు రామ్ చరణ్ త్వరలోనే ఎవరూ ఊహించని ఒక మైండ్ బ్లాకింగ్ కాంబినేషన్‌తో రాబోతున్నట్లు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.


తానాజీ చిత్రంతోపాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక భారీ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఓం రౌత్ ఈ పేరు చెప్తే తెలుగు ప్రేక్షకులకు గుండెల్లో బాంబ్ పడినట్టే. ప్రభాస్ తో ఆదిపురుష్ లాంటి కళాఖండాన్ని తెరకెక్కించి ట్రోల్ కంటెంట్ అయ్యాడు. ఇక ఆ సినిమా తరువాత ఆయన పేరు చెప్తే టాలీవుడ్ ప్రేక్షకులు వద్దు బాబు వద్దు.. అంటూ దండం పెడుతున్నారు. ఇప్పుడు అలాంటి డైరెక్టర్ తోనే మెగా పవర్ స్టార్ చేయి కలపడం ఇండస్ట్రీని కుదిపేస్తుంది. ఇటీవల ఓం రౌత్ రామ్ చరణ్‌ను కలసి ఒక లైన్ వినిపించగా, దానికి చరణ్ కూడా ఎంతగానో ఇంప్రెస్ అయి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్‌కు తగినట్లుగా ఓం రౌత్ ఒక పవర్‌ఫుల్ అండ్ విజువల్లీ రిచ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడని టాక్.


ఈ ప్రాజెక్ట్ ఒక పీరియాడిక్ హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఓం రౌత్ గత చిత్రాల తరహాలోనే ఇది కూడా అత్యాధునిక విఎఫ్ఎక్స్, భారీ గ్రాఫిక్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్సెస్‌తో కూడుకున్న విజువల్ వండర్‌గా ఉండబోతోందట. లార్జర్ దాన్ లైఫ్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా చరణ్ కెరీర్‌లోనే మరొక అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా నిలిచే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్త విన్న మెగా ఫ్యాన్స్ మాత్రం గుండెలు బాదుకుంటున్నారు. జోక్ చేస్తున్నారా.. చరణ్, ఓం రౌత్ కాంబో ఏంటి.. ? నమ్మడానికే వీలు లేకుండా ఉంది. చరణ్ అన్నా.. సినిమా చేయకపోయినా పర్లేదు కానీ.. బాలీవుడ్ వద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కాంబో నిజమా కాదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Updated Date - Sep 16 , 2026 | 11:01 AM