సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పెద్ది సెకండ్ సింగిల్.. ‘రై రై రా రా' వ‌చ్చేస్తోంది

ABN, Publish Date - Feb 27 , 2026 | 06:54 AM

హీరో రామ్ చ‌రణ్, బుచ్చిబాబు కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న పెద్ది నుంచి రెండో పాట అప్డేట్ వ‌చ్చింది.

Ram Charan

హీరో రామ్ చ‌రణ్ (Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం పెద్ది (Peddi) విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ మెగా అభిమానుల్లో అంచనాలు అంతకంతకూ రెట్టింపు అవుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే విడుదలైన తొలి గీతం 'చికిరి చికిరి'కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. 'రైరైరా రా..' అంటూ సాగే రెండో గీతాన్ని మార్చి 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్‌లో రామ్ చ‌రణ్ మాసీ అవతార్‌లో కనిపిస్తున్నారు. మాసిన దుస్తులు, చెదిరిన జుట్టు, పెరిగిన గడ్డం, భుజంపై పెద్ద సుత్తిని వేలాడదీసుకుని, మెరిసే చిరునవ్వుతో కనిపిస్తున్నారు.

Updated Date - Feb 27 , 2026 | 06:54 AM