సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ram Charan: పెద్ది చూస్తూ.. రామ్ చరణ్ భావోద్వేగం

ABN, Publish Date - Jun 08 , 2026 | 11:12 AM

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన నటించిన ‘పెద్ది’ (Peddi) చిత్రాన్ని ఆదివారం రాత్రి చిత్రబృందం, అభిమానులతో కలిసి వీక్షించారు.

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన నటించిన ‘పెద్ది’ (Peddi) చిత్రాన్ని ఆదివారం రాత్రి చిత్రబృందం, అభిమానులతో కలిసి వీక్షించారు. సినిమాకు వస్తున్న స్పందన, పలు సన్నివేశాలకు ప్రేక్షకులు కనెక్ట్‌ అయిన తీరును గమనించిన ఆయన ఒకింత భావోద్వేగానికి లోనై కంట తడిపెట్టుకున్నారు. కొన్ని సన్నివేశాలకు ఆడియన్స్‌ రియాక్ట్‌ (Audience reaction) అయిన తీరు చూసి ఆనందించారు. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వెంకట సతీశ్‌ కిలారు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.236 కోట్లు కలెక్ట్‌ చేసింది. మొదటి మూడు రోజులు థియేటర్ల దగ్గర అభిమానులు హవా కొనసాగగా, వీకెండ్‌ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్లకు క్యూ కడుతున్నారు. మరో పక్క జాన్వీకపూర్‌ పోషించిన పాత్రపై టోల్రింగ్‌ జరగగా దర్శకుడు క్షమాపణ చెప్పి అభ్యంతరకర సన్నివేశాలను తొలగిస్తామని తెలిపారు.

రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించారు. ఇందులో ప్రత్యేక గీతంలో శ్రుతీహాసన్‌ అలరించారు.

ALSO READ: Peddi: బాలీవుడ్ అన్ని ఉత్తమ చిత్రాలే తీసిందా.. పెద్ది పై ఎందుకంత..

Balakrishna: బాలయ్యను ప్రేమిస్తే ‘నో బ్రేకప్స్‌’...

Peddi: గురువు సుకుమార్‌లా బ్యాలెన్స్ చేయలేకపోయిన బుచ్చి!




Updated Date - Jun 08 , 2026 | 11:28 AM