సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మళ్లీ నోరుజారి దొరికిపోయిన రామ్ చరణ్..

ABN, Publish Date - Jun 23 , 2026 | 04:18 PM

ఈమధ్య కాలంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కి ఏమైందో అర్దం కావడం లేదు. మైక్ పట్టుకోగానే తడబడుతున్నాడు. అలా తడబడి ట్రోలింగ్ కి గురవుతున్నాడు.

Ram Charan

ఈమధ్య కాలంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కి ఏమైందో అర్దం కావడం లేదు. మైక్ పట్టుకోగానే తడబడుతున్నాడు. అలా తడబడి ట్రోలింగ్ కి గురవుతున్నాడు. మొన్నటికి మొన్న క్రికెటర్ ని ఫుడ్ బాల్ ప్లేయర్ అన్నాడు.. ఆ తరువాత నిర్మాత వెన్నుపోటు అంటూ నోరు జారాడు. ఇక ఇప్పుడు మరోసారి నేషనల్ మీడియాలో నోరుజారీ దొరికిపోయాడు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి ఊహించని రేంజ్‌లో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. అసలేమైంది అంటే.. ప్రతి ఏడాది రిపబ్లిక్ టీవీ నెట్‌వర్క్ నిర్వహించే వార్షిక జాతీయ సమ్మిట్ ఢిల్లీలో జరిగింది. ఇందులో దేశ విదేశాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలు పాల్గొని వివిధ అంశాలపై చర్చిస్తారు.

ఈ ఏడాది జరిగిన ఈ సమ్మిట్ కి ది న్యూ ఏజ్ మెగాస్టార్ గా రామ్ చరణ్ హాజరయ్యాడు. ఎన్నో అంశాల గురించి చర్చించిన చరణ్.. బాలీవుడ్ తో పాటు ఇండస్ట్రీని షేక్ చేసిన ధురంధర్ సినిమా గురించి మాట్లాడాడు. తాను గత వారమే ఈ చిత్రాన్ని ఓటీటీలో చూశాను అని, చాలా టెర్రిఫిక్ మూవీ అని చెప్పుకొచ్చాడు. ఇక్కడే చరణ్ దొరికిపోయాడు. ధురంధర్ ది రివెంజ్ మార్చి 19 న రిలీజ్ అయ్యింది. ఆ నెక్స్ట్ డేనే చరణ్ ఈ సినిమా గురించి ఎక్స్ లో రివ్యూ ఇచ్చాడు. సినిమా చాలా గ్రిప్పింగ్‌గా ఉందని, నటించినవారందరూ చాలా బాగా చేశారని చెప్పుకొచ్చాడు. ఆయన పెట్టిన ట్వీట్ అప్పట్లో ఫ్యాన్స్‌కు బాగానే జోష్ ఇచ్చింది.

ఇక ఇప్పుడు చరణ్.. ధురంధర్ సినిమాను ఓటీటీలో చూశాను అని చెప్పడం సంచలనంగా మారింది. థియేటర్లలో చూశానని అప్పుడు ట్వీట్ వేసింది నిజమైతే, ఇప్పుడు మళ్లీ ఓటీటీలో చూశానని ఎందుకు చెప్తాడు.. ? అంటే సినిమా చూడకుండానే కేవలం పిఆర్ టీమ్ రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే బ్లైండ్‌గా ప్రమోట్ చేస్తున్నాడా.. ? అంటూ యాంటీ ఫ్యాన్స్, నెటిజన్లు రామ్ చరణ్ పాత ట్వీట్‌ను, నిన్నటి వీడియోను జత చేస్తూ విపరీతమైన మీమ్స్, సెటైర్లతో విరుచుకుపడుతున్నారు. స్టార్ హీరో అయ్యి ఉండి కనీసం తానేం మాట్లాడుతున్నాడో వెరిఫై చేసుకోకుండా ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడం వలన వారికి వారే ట్రోలింగ్ కి స్టఫ్ ఇస్తున్నాడని అంటున్నారు. ఇంకొంతమంది చరణ్ రెండోసారి సినిమా చూసి ఉంటాడు. దానికేందుకు అంత రచ్చ చేస్తున్నారు అంటూ పెదవి విరుస్తున్నారు.

Updated Date - Jun 23 , 2026 | 04:40 PM