డబ్బింగ్ మొదలెట్టిన పెద్ది
ABN, Publish Date - Mar 01 , 2026 | 07:31 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం పెద్ది (Peddi). వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం పెద్ది (Peddi). వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక పెద్ది సినిమా ఏప్రిల్ 30 న రిలీజ్ కు సిద్ధమవుతోంది. తాజాగా రామ్ చరణ్ పెద్ది డబ్బింగ్ ని మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో చరణ్.. డబ్బింగ్ చెప్తూ కనిపించారు. ఏమది అని బేస్ వాయిస్ లో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.
డబ్బింగ్ అనంతరం బుచ్చిబాబు డెడికేషన్ ను చరణ్ ప్రశంసించారు. చికిరి చికిరి సాంగ్ కోసం బుచ్చిబాబు కష్టపడిన విధానాన్ని చరణ్ మెచ్చుకున్నారు. చికిరి చికిరి సాంగ్ వీడియోలో సింగర్ మోహిత్ చౌహన్ కన్నా నువ్వే ఎక్కువ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చావ్.. నాకే డౌట్ వచ్చింది.. సాంగ్ నువ్వు పాడావా.. ? ఆయన పాడారా.. ? అని. డబ్బింగ్ లో కూడా అలా యాక్ట్ చేయకు.. నేనే డబ్బింగ్ చెప్పానండీ .. ఇది నిజం అంటూ డైరెక్టర్ ను ఆటపట్టించారు.
ఇక ఈ వీడియోతో పాటు మేకర్స్ మరో వీడియోను కూడా రిలీజ్ చేశారు. చరణ్ ఇంట్లో తన పెంపుడు పక్షులతో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందులో చరణ్ ఒక పక్షితో మాట్లాడుతూ ఉండగా.. ఆ వీడియో తీసే వ్యక్తి సార్ దీని పేరు ఏంటి అడిగాడు. దానికి చరణ్.. రంగస్థలం తరువాత చిట్టి అని పెట్టాను అని చెప్పారు. మరి పెద్ది అని దేనికి పెడతారు అని అడగ్గా.. ఒక గుర్రం కొని దానికి పెద్ది అని పేరు పెడతాను అని చెప్పారు. దీంతో త్వరలోనే చరణ్ ఇంటికి పెద్ది రాబోతుందని ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఇప్పటికే చరణ్ మగధీర తరువాత కాజల్ అనే గుర్రాన్ని పెంచుతున్న విషయం తెల్సిందే.